Home News భాగ్యనగర్ లో ఆర్.ఎస్.ఎస్ సమన్వయ సమావేశాలు

భాగ్యనగర్ లో ఆర్.ఎస్.ఎస్ సమన్వయ సమావేశాలు

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల ప్రధాన కార్యనిర్వహణ అధికారుల సమన్వయ సమావేశాలు వచ్చే నెల (జనవరి, 2022) 5 నుండి 7 వరకు తెలంగాణాలోని భాగ్యనగర్ లో జరుగుతాయని ఆర్ .ఎస్ .ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ సునిల్ అంబేకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాల్లో పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ శ్రీ. దత్తాత్రేయ హోసబలేలతో సహా ఐదుగురు సహ కార్యవాహలు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొంటారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ కు చెందిన శ్రీ హిరణ్మయ పాండే, శ్రీ సురేందర్, విశ్వహిందూ పరిషత్ శ్రీ ఆలోక్ కుమార్, శ్రీ మిళింద్ పరాండే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి శ్రీ ఆశిష్ చౌహాన్, శ్రీ నిధి త్రిపాఠి, బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి నడ్డా, శ్రీ బి.ఎల్. సంతోష్, భారతీయ కిసాన్ సంఘ్ నుండి శ్రీ దినేష్ కులకర్ణి, విద్యభారతికి చెందిన శ్రీ. రామకృష్ణా రావు, శ్రీ జి.ఎం. కాశీపతి, రాష్ట్ర సేవికా సమితి నుండి వందనీయ శాంతక్క, సు.శ్రీ. అన్నదానం సీతక్క, వనవాసీ కళ్యాణాశ్రమ్ కు చెందిన శ్రీ. రామచంద్ర రెడ్డి, శ్రీ.అతుల్ జోగ్ లతో సహా మొత్తం 36 సంస్థలకు చెందిన కార్యనిర్వహణ అధికారులు ఇందులో పాల్గొంటారు. ఈ సంస్థలు విద్య, ఆర్ధిక రంగం, సేవ మొదలైన వివిధ సామాజిక రంగాల్లో నిరంతరం పనిచేస్తున్నాయి. ఇలాంటి సంస్థలలో పనిచేసే స్వయంసేవకులతో సంఘం సమన్వయాన్ని కొనసాగిస్తుందని శ్రీ సునీల్ అంబేకర్ తెలిపారు.

వర్తమాన పరిస్థితుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి అనే విషయాలను అన్ని సంస్థలకు చెందిన ప్రతినిధులు వివరిస్తారు. పర్యావరణం, కుటుంబ ప్రబోధన్, సామాజిక సమరసత వంటి అంశాల్లో సమన్వయంతో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయంపై కూడా చర్చ జరుగుతుందని శ్రీ సునీల్ అంబేకర్ వెల్లడించారు.