Home News పూణేలో ఆర్.ఎస్‌.ఎస్ స‌మ‌న్వ‌య స‌మావేశాలు ప్రారంభం 

పూణేలో ఆర్.ఎస్‌.ఎస్ స‌మ‌న్వ‌య స‌మావేశాలు ప్రారంభం 

0
SHARE

సెప్టెంబ‌ర్ 14 నుంచి 16 వ‌ర‌కు మూడు రోజుల పాటు జ‌రిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత సమన్వయ సమావేశాలు గురువారం 9 గంటలకు పూణెలో ప్రారంభమ‌య్యాయి. మాన‌నీయ సర్ సంఘ‌చాల‌క్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ, మాన‌నీయ స‌ర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబాలే జీ భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి . సమావేశాన్ని ప్రారంభించారు. 36 సంస్థలకు చెందిన 267 ప్ర‌తినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ- స‌ర్ కార్య‌వాహ‌లు డాక్టర్ కృష్ణగోపాల్ జీ, డాక్టర్ మన్మోహన్ వైద్య జీ, అరుణ్ కుమార్ జీ, ముకుంద జీ, రామదత్ చక్రధర్ జీ, అఖిల భార‌త కార్య‌కారిణీ స‌ద‌స్యులు భయ్యాజీ జోషి, సురేష్ సోనీ జీ, వి. భాగయ్య జీ, రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ్ సంచాలిక వందనీయ శాంతక్క జీ, కార్యవాహిక అన్నదానం సీతక్క జీ, మ‌హిళా స‌మ‌న్వ‌య్ నుంచి చందాతాయ్‌, స్త్రీ శక్తి అధ్యక్షురాలు శైలజా జీ, సేవాభారతి మహా మంత్రి రేణు పాఠక్ జీ, వ‌న‌వాసి క‌ళ్యాణ్ ఆశ్ర‌మ్ అధ్యక్షులు రామచంద్ర ఖరాడి జీ,  విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ జీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు రాజశరణ్ షాహి జీ, భారతీయజనతాపార్టీ (BJP) జాతీయ అధ్యక్షులు జె.పి. నడ్డా జీ, భారతీయ కిసాన్ సంఘ్ సంఘ‌ట‌న మంత్రి దినేష్ కులకర్ణి జీ, విద్యాభారతి అధ్యక్షుడు రామకృష్ణారావు జీ, మాజీ సైనికుల సేవా మండలి అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది జీ, భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు హిరణ్మ‌య్ పాండ్యా, సంస్కృత భారతి సంఘ‌ట‌న మంత్రి దినేష్ కామత్ తదితరులున్నారు.

ప్రస్తుత జాతీయ,  సామాజిక ప‌రిస్థితులు, విద్య, సేవ, ఆర్థిక, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల‌పై ఈ స‌మావేశాల్లో చ‌ర్చిస్తారు. సామాజిక మార్పు, పర్యావరణం, కుటుంబ జ్ఞానోదయం, సామాజిక సామరస్యం, దేశీయ ప్రవర్తన, పౌర కర్తవ్యం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లడంపై కూడా చర్చ జరుగుతుంది. సంఘ విస్తరణ, ప్రత్యేక ప్రయోగాల గురించిన విష‌యాల‌పై కూడా RSS అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు చర్చిస్తాయి.

జాతీయ సమస్యల ప‌రిష్కారం, సామాజిక మార్పు ల‌క్ష్యంగా ఆర్‌.ఎస్‌.ఎస్ స‌మ‌న్వ‌య స‌మావేశాలు – సునీల్ జీ అంబేక‌ర్

 జాతీయ సమస్యల ప‌రిష్కారం, సామాజిక మార్పు ల‌క్ష్యంగా ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త స‌మ‌న్వ‌య స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న‌ట్టు ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ జీ అంబేకర్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ సమన్వయ సమావేశం వివరాలను తెలిపేందుకు బుధ‌వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణ అనుకూల జీవనశైలి, జీవనవిలువ ఆధారిత కుటుంబ వ్యవస్థ, సామరస్యానికి కట్టుబడడం, స్వదేశీ విధానం, పౌర విధుల నిర్వహణ వంటి ఐదు అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు ఆయ‌న తెలిపారు. ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు తమ శాఖ పని ద్వారా నిరంతరం దేశ సేవలో నిమగ్నమై ఉన్నార‌ని, శాఖ పనితో పాటు, సేవా, దేశ నిర్మాణానికి  సంబంధిచిన సామాజిక జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల పనిలో నిమగ్నమై ఉన్నార‌ని తెలిపారు. ఈ సమావేశానికి హాజరయ్యే అన్ని సంస్థలు సంఘం నుండి ప్రేరణ పొంది, సామాజిక జీవితంలోని అన్ని రంగాలలో స్వయంప్రతిపత్తితో పనిచేస్తున్నాయ‌న్నారు. ఆయా సంస్థ‌ల ప‌నితీరును, అనుభవాలను పంచుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుని, నేర్చుకునే అవకాశం ఈ స‌మావేశంలో క‌లుగుతుందని అన్నారు. ఈ సంస్థలన్నీ ఒకే  లక్ష్యంతో పని చేస్తాయ‌ని, అటువంటి సామూహిక పనికి సంబంధించిన అంశాలను కూడా ఈ సమావేశాలలో కూడా చర్చిస్తార‌ని తెలిపారు.

సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను క్రోడీకరించడం, ఒక దిశను నిర్ణయించడం, జాతీయ స్ఫూర్తితో పని చేయడం, తద్వారా పనిలో వేగం పెరగడం ఈ సమావేశ ముఖ్య‌ ఉద్దేశ్యం అన్నారు. జాతీయ పరిస్థితులు, ప్రస్తుత దృష్టాంతంలో వారు తమ అనుభవాలను కూడా ఇక్కడ వివరిస్తారు. దీనికి సంబంధించిన అనేక అంశాలపై ప్రాథమిక చర్చలు కూడా ఉంటాయి. ఆయాల సంస్థ‌ల భవిష్యత్తు దిశ, వారి ఆలోచ‌న‌లు మొదలైన వాటి గురించి వారు తమ ప్రణాళికలను కూడా ఇక్కడ పంచుకుంటారు.

ఈ సమావేశాల్లో  సామాజిక మార్పు కోసం జరుగుతున్న కృషి, జీవన విలువలతో కుటుంబాలను ఎలా నడపడం, పర్యావరణ పరిరక్షణతో మన జీవితాలు ఎలా ఉండాలి, స్వదేశీతో మన ఆర్థిక విధానాలు రూపుదిద్దుకోవాలన్న సందేశం ఉంటుందని వారన్నారు. కుల వివక్ష అంతమయ్యేలా సామరస్యం గురించి ఈ మూడు రోజుల్లో  ఈ సమావేశాలలో చర్చిస్తారు. ఈ సమావేశం ప్రతి సంవత్సరం జరుగుతుంది. గతేడాది ఛత్తీస్ గ‌డ్ రాయ్ పూర్  జరిగింది.