Home News ఆంధ్రప్ర‌దేశ్ : నివ‌ర్ బాధితుల‌కు సేవా భార‌తి ‌స‌హాయ‌క చ‌ర్య‌లు

ఆంధ్రప్ర‌దేశ్ : నివ‌ర్ బాధితుల‌కు సేవా భార‌తి ‌స‌హాయ‌క చ‌ర్య‌లు

0
SHARE

నివర్ తుఫాను కారణంగా నెల్లూరు గూడూరు మధ్య హైవేలో రోడ్డు దెబ్బతినడంతో రాక‌పోక‌లు నిలిచిపోయాయి. వరదలలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు అండగా నిలిచారు. వారికి అల్పాహారం, బన్ను, బిస్కెట్ ప్యాకెట్ లు, పాలు, టీ ఏర్పాటు చేశారు.

నివర్ తుఫాన్ కారణంగా నెల్లూరు, గూడూరు మధ్యలో గూడూరుకు సమీపంగా గల ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద రహదారి దెబ్బతినడంతో అటు ఇటు వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఆ వాహనాలలో ఉన్న వృద్ధులు, మహిళలు, చిన్నారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్న సంగతి తెలుసుకున్న ఆర్‌.ఎస్‌.ఎస్ కార్యకర్తలు బన్నులు, బిస్కెట్ ప్యాకెట్ లు, పాలు, టీ, అల్పాహారం సిద్ధం చేసుకుని వెనువెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ సుమారు 25 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలలోని ప్రయాణికులకు వాటిని ఇచ్చి వారి ఆకలి తీర్చారు. ముఖ్యంగా చిన్నారులకు పాలు దొరక్క ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ఆర్‌.ఎస్‌.ఎస్ వారు సమయానికి పాలు అందించడం పట్ల ఆ వాహనాలలోని మాతృమూర్తులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఆర్‌.ఎస్‌.ఎస్ కార్యకర్తలు 26వ తేది సాయంత్రం నుంచి సుమారు 35 గంటలపాటు నిర్విరామంగా సుమారు 6000 మంది ప్రయాణికులకు తమ సేవలను అందించారు.

వెస్ట్ బెంగాల్ నుంచి తమిళనాడు వెళ్తున్న‌ ఒక బస్సులోని ప్రయాణికులకు నెల్లూరు సమీపంలో 27వ తేదీ ఉదయం 11 గంటలకు కార్యకర్తలు ఆహార పదార్థాలను అందించారు. అదే రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో అదే కార్యకర్తల జట్టు గూడూరు వద్దగల ఆదిశంకర కాలేజ్ వద్దనున్న వాహనాలలో గల ప్రయాణికులకు ఆహార పదార్ధాలని అందిస్తున్నప్పుడు ఒక బస్సు డ్రైవర్ అన్నా పొద్దున మాకు భోజనం అందించింది మీరే కదా? అంటూ ఆప్యాయంగా పలకరించాడు.

నెల్లూరు సమీపం నుంచి ఆ ప్రదేశం సుమారు 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అంటే ఆ బస్సు ఆ 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి 12 గంటల సమయం పట్టిందన్నమాట. దీన్నిబట్టి పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఉదయం నుంచి రాత్రి తెల్లవార్లూ కార్యకర్తలు ప్రయాణికుల ఆకలి తీర్చడంలో నిర్విరామంగా నిమగ్నమై ఉన్న విషయం కూడా మనకు ఆశ్చర్యం కలిగించక మానదు. ” పొద్దున మాకు సమయానికి భోజనం అందించారు. ఇప్పుడు కూడా బాగా ఆకలిగా ఉన్నాం. ఇప్పుడూ మీరే వచ్చి మా ఆకలి బాధ తీరుస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వారు చేస్తున్న సేవ నిజంగా చాలా గొప్పది. మీకు నా ధన్యవాదాలు”. అంటూ తమిళంలో చెబుతున్న ఆ డ్రైవర్ ని చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయారు ఆర్ ఎస్ ఎస్ యువకులు. ” అందరూ కాలేజీ పిల్లలే ఉన్నట్టున్నారయ్యా. వాళ్లు అలా రేయింబవళ్ళు ఎలా సేవ చేయగలిగారో నాకర్థం కావట్లేదు. వాళ్లకి అంతటి ప్రేరణ ఎలా వచ్చింది?” అంటూ గూడూరుకు చెందిన స్థానిక మిత్రుడొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఆర్ ఎస్ ఎస్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్” అని ఊరకే అన్నారా?

Source : VSK ANDHRA