సంఘటిత భారత్ సమర్ధ భారత్. సంఘటిత భారత్ స్వాభిమాన భారత్. సంఘటిత భారత్ సమగ్ర భారత్. అటువంటి సంఘటిత భారత్ ను రూపొందించడంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలి. ఇదే ఈ హిందూ శక్తి సంగమం సందేశం. ప్రపంచానికి భారత్ ఆశాకిరణం అయితే, భారత్ కు హిందూ సమాజం ఆధారం. ఆ హిందూ సమాజ సంఘటన కోసం ఆర్ ఎస్ ఎస్ 90ఏళ్ళకు పైగా కృషి చేస్తున్నది. కులం, ప్రాంతం, భాష, మొదలైన విభేదాలను పక్కన పెట్టి మనమంతా హిందువులమానే విషయాన్ని గుర్తించాలి. కానీ విచిత్రమేమిటంటే విభజన వాదాన్ని రెచ్చగొట్టే విధానం సెక్యులర్ గా గుర్తింపు పొందుతుంటే, సమైక్య, సంఘటిత వాదాన్ని గుర్తుచేయడం మతతత్వం, కమ్యూనల్ అవుతోంది. భేదభావాలు, హెచ్చుతగ్గుల భావాలు లేని హిందూ సమాజాన్ని నిర్మాణం చేయడమే ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతం, లక్ష్యం.