మహారాష్ట్రలోని కొరేగావ్ , పూనా తదితర ప్రదేశాలలో ఇటీవల హింసాత్మక సంఘటనలు చాలా విచారాన్ని, బాధను కలిగించాయని, ఇటువంటి హింసను ఆర్ ఎస్ ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని, గర్హిస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ సంఘటనలు బాధ్యులైనవారిని చట్టంప్రకారం కఠినంగా శిక్షించాలి. సమాజంలోని వివిధ వర్గాల మధ్య వైమనస్యాన్ని, ద్వేషాన్ని కలిగించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని , అలాంటి శక్తుల కుట్రలకు లోనుకాకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని సంఘ అఖిలభారతీయ ప్రచార ప్రముఖ్ డా. మన్మోహన్ వైద్య ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజలు సమాజంలో ఐక్యత, సామరస్యాలను కాపాడుకోవాలని, సామాజిక ఐక్యత, సామరస్యాలకే ఆర్ ఎస్ ఎస్ ప్రధాన్యతనిస్తుందని మన్మోహన్ జీ తెలిపారు.