Home News జాతీయ జెండా గౌర‌వాన్ని నిలిపిన స్వ‌యంసేవ‌క్

జాతీయ జెండా గౌర‌వాన్ని నిలిపిన స్వ‌యంసేవ‌క్

0
SHARE

డిసెంబర్ 27-28, 1937లో, ఫయిజ్ పూర్ (యావల్ తాలూకా, జలగావ్ జిల్లా, మహారాష్ట్ర ) లో జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో, 80 అడుగుల ఎత్తు గల స్తంభానికి మన మువ్వన్నెల జాతీయజెండా మార్గమధ్యంలో చుట్టుకొని, చిక్కుపడింది. అక్క‌డున్న చాలా మంది కాంగ్రెస్ నాయకులు (సమావేశాల అధ్యక్షుడు నెహ్రూతో సహా) కంగారుపడ్డారు. కొందరు కార్యకర్తలు జెండా చిక్కుముడి విప్పేందుకు విఫలయత్నాలు చేశారు.

అప్పుడు, రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స్వ‌యంసేవ‌క్ అయిన శ్రీ కిషన్ సింగ్ పరదేశి ఎంతో సాహసంతో ఆ జెండా స్తంభాన్ని ఎక్కి, చిక్కుపడ్డ జెండా వస్త్రాన్ని, సరిచేసి జెండాను సరిగ్గా ఎగిరేటట్లు సఫలం చేశారు. ఎప్పుడైతే 80 అడుగుల స్తంభం అగ్రభాగాన, జెండా విజయవంతంగా ఎగురుతున్నదో, అక్కడ ఉన్న జనసందోహ అపరిమిత ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఎంతో ప్రమాదమని తెలిసినా సాహసంగా  జెండా సరిగ్గా ఎగురవేసిన ఆ కిషన్ సింగ్ గారిని సన్మానించాలని  అప్ప‌టి కాంగ్రెస్ స‌మావేశాల్లో ప్రతిపాదించారు. అయితే కిషన్ సింగ్ గారు మాత్రం తనకు, ఆ తెగువ, సాహసం, దైర్యం, ఆర్‌.ఎస్‌.ఎస్ లో నేర్చుకున్న జాతీయ స్ఫూర్తివల్లనే కలిగాయని అక్కడ ప్రకటించగానే, ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకులు విస్మ‌య‌పోయారు. ఒక సంఘ స్వయంసేవకుని వాళ్ళు ఎలా సన్మానించగ‌ల‌మ‌ని కాంగ్రెస్ నాయ‌కులు సందేహంలో ప‌డ్డారు. స‌న్మానం చేయ‌డానికి వెనుక‌డుగు వేశారు. దీనితో హిందూసంస్థల పట్ల కాంగ్రెస్ నాయకుల వివక్ష, పక్షపాతధోరణి అందరికీ ఆనాడే అవగతమైంది.

సంఘ స్వయంసేవక్ చూపిన ఈ సమయస్ఫూర్తి, సాహసోపేత కార్యం తెలుసుకున్న సంఘస్థాపకులైన డా. హెడ్గేవార్ గారి ఆనందానికి అవధుల్లేవు. వారు సంఘసహజ సిద్ధాంతభాగమైన ప్రచారవిముఖతను సైతం ప‌క్క‌న‌బెట్టి శ్రీ కిషన్ సింగ్ పరదేశీ గారిని దేవపూర్ శాఖకి ఆహ్వానించి, అక్కడ ఆయనను ఘనంగా సన్మానించారు. ఆ కార్యక్రమంలో ఆయనకు ఒక చిన్న వెండిపాత్రను బహుమతి అందజేశారు. ఆ సంద‌ర్భంగా డా. హెడ్గేవార్ గారు ఇలా అన్నారు – ” దేశానికి, దేశప్రయోజనాలకు సంబంధించిన కార్యక్రమాలలో ఏదైనా ఇబ్బంది, అడ్డంకి ఎప్పుడైనా ఎదురైతే,  అవసరమైతే తన జీవితాన్నే పణంగా పెట్టగల సహజమైన కర్తవ్యం స్వయంసేవక్ లది. ఇదే మన రాష్ట్రధర్మం లేదా జాతీయ కర్తవ్యం.”

ఇలా ఒక వైపు డా. హెడ్గేవార్ గారు, ఆంగ్లేయుల సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తమ జాతీయస్ఫూర్తిని ప్రదర్శిస్తే, అటు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం, సంఘ్ పట్ల తమ విద్వేషాన్ని దాచుకోకుండా వెళ్ళగ్రక్కారు. కానీ, సంఘ సానుభూతిపరుడైన, డా. కాకాసాహెబ్ టెంభే అనే కాంగ్రెస్ నాయకుడు మాత్రం చాలా కలవరపడ్డాడు. ఆయన డా. హెడ్గేవార్ గారికి – కాంగ్రెస్ సంస్థ కార్యనిర్వహణా పద్దతిని, పనితీరుని నిరసించమని, సైద్ధాంతిక ధోరణిని విమర్శించమని సలహాయిస్తూ – ఒక లేఖ వ్రాశారు. ఇలా చేస్తే, సంఘ స్వయంసేవకులలో కాంగ్రెస్ పట్ల ఉన్న అసంతృప్తిని కొంత శాంతింప చేయవచ్చు, అని డా. టెంభే భావించారు.

అయితే, ఆయనకు  డా. హెడ్గేవార్ గారి సమాధానం, కాంగ్రెస్ సంస్థ పట్ల వారి స్వంత మూల్యాంకనం మాత్రమే కాక, వారి వేదాంత ధోరణిని కూడా విశదపరచింది. డా. హెడ్గేవార్ గారు, స్వయంసేవకుల మనస్సులలో, కాంగ్రెస్ పట్ల ఎటువంటి విముఖత, అసంతృప్తి లను అనుమతించదలచుకోలేదు. వారి వద్ద రెండే మార్గాలున్నాయి. ఒకటి – సంఘ్ స్వయంశక్తితో, వేగంగా ఒక సంపూర్ణ క్రాంతి ద్వారా ఆంగ్లేయులను తరిమికొట్టగల స్వీయసామర్థ్యాన్ని పెంపొందించుకావాలి లేదా – ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని, కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే కొనసాగించాలి.  డా. హెడ్గేవార్ గారు, ఈ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి, రకరకాల పోరాటకేంద్రాలు ఉండాలని భావించలేదు. వారి తార్కిక విధానపరమైన ఇటువంటి ఆలోచనే, డా. టెంభే గారికి ఈ విధంగా సమాధానం వ్రాయాలని అనిపించింది.

“ప్రపంచంలో ప్రతి వ్యక్తీ తన ప్రవృత్తికి తగ్గట్లుగా మాట్లాడతాడు, ప్రవర్తిస్తాడు. అతడు ఒక రాజకీయ పక్షానికో, సిద్ధాంతానికో ప్రతినిధి అని భావించాల్సిన అవసరం లేదు. అది తప్పనిసరి కూడా కాదు. నా ఉద్దేశంలో, ఏదైనా ఒక సంస్థకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడనుకొనే ఏదైనా సభ్యుడు చేసే ప్రకటనలకు, ఆ పక్షాన్ని లేదా సిద్ధాంతాన్ని ప్రస్తుతించటం లేదా నిందించటం పొరపాటు. ఏదైనా రాజకీయ పక్షానికి చెందిన ఉన్నతమైన సంస్కారం గలిగిన అగ్రనాయకుడు, ఇంకో పక్షం బాగుండకూడదు, అని భావించడు. “ ఇదీ ప.పూ. డాక్టర్ జీ కి గల జాతీయ దృక్కోణం, వ్యక్తిగత సంస్కారం.

Source : “Arise Bharath”

అనువాదం: సత్యనారాయణమూర్తి