మలక్ పేట్ నగర్ విజయదశమి ఉత్సవం గురువారం మూసారాంబాగ్ లోని వివేకానంద్ సెంటినరీ స్కూల్లో జరిగింది. బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్‌లో క్రిటికల్ కార్డియాక్ కేర్ హెడ్ డా. రాహుల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల్ భారతీయ కార్యకారిణి సదాస్య శ్రీ వారణాసి రామ్ మాధవ్ ముఖ్య వక్తగా ఉన్నారు. స్వయంసేవకులు దండ, వ్యాయామ్ యోగ్, యోగ ఆసనాలను ప్రదర్శన చేశారు. ఆ తర్వాత ముఖ్య అతిథి డాక్టర్ రాహుల్ అగర్వాల్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఆరోగ్యం పట్ల మనకు ఉన్న దృష్టికోణాని పూర్తిగా మార్చేసింది అన్నారు. రెండవ వేవ్ లో అధిక సంఖ్యలో యువకుల మరణాలు మన దైనందిన జీవితంలో అవసరమైన జీవనశైలి మార్పులకు మేల్కొలుపుగా ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన మాట్లాడారు. మహమ్మారి సమయంలో ఆక్సిజన్ సరఫరా, ఫ్రంట్‌లైన్ కార్మికులకు సహాయం అందించడం కోసం అవిశ్రాంతంగా పనిచేసిన స్వయం సేవకుల క్రమశిక్షణ, విధి భావనను ఆయన ప్రశంసించారు. మాస్కులు ధరించడం భౌతిక దూరాన్ని పాటించడం, చేతుల పరిశుభ్రత పాటించడం ఇంకో సంవత్సర కాలం పాటు చేస్తే మన దేశం పూర్తిగా కరోనా మహమ్మారి నుండి బయటపడతామని వారు అభిప్రాయపడ్డారు
అనంతరం ప్రధాన వక్త రామ్ మాధవ్ జీ మాట్లాడుతూ భారతదేశంలోని గొప్ప సంస్కృతి వారసత్వాన్ని గుర్తు చేసారు. మన పండగలన్నిటికి చాలా లోతైన అర్ధం ఉందని వాటిని మరవకూడదన్నారు. ఈ ప్రపంచంలో బలం నిర్ణయాత్మక కారకం అయినప్పటికీ, హిందూ సంస్కృతం బలాన్ని ఆరాధించలేదని, కేవలం సరైన సమయంలో, సరైన ప్రయోజనం కోసం ఉపయోగించబడిన ధార్మిక శక్తిని ఆరాధించింది అన్నారు. విజయదశమి ఈ శక్తి ఆరాధనా కి ప్రతీకగా ఉందని చెప్పారు.
97 సంవత్సరాల క్రితం పూజ్యనీయ డాక్టర్ హెడ్గేవార్ ఆర్.ఎస్.ఎస్ ని ప్రారంభించిన రోజు కూడా విజయదశమి కావడం యాదృశ్చికం అన్నారు. భారతీయ సామాజిక జీవితంలో ఆర్.ఎస్.ఎస్ ని చాలా దుర్మార్గంగా, ‘ఫ్రింజ్’ గా భావించే రోజుల నుండి ఆర్.ఎస్.ఎస్ ఇప్పుడు మన జాతీయ జీవనలో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తోందన్నారు. కొంతమంది రాజకీయ నాయకులను మినహాయించి, మొత్తం హిందూ సమాజం మన జాతి కోసం స్వయం సేవకుల నిబద్ధతను, అసమానమైన అంకితభావాన్ని అంగీకరిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన శక్తి ఆధారంగా సకారాత్మకమైన సామాజిక మార్పు కోసం స్వయంసేవకులు కృషి చెయ్యాలన్నారు.
ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా అది అవినీతి, వేర్పాటువాదం ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడిందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయబడితే కశ్మీర్‌లో రక్తపాతం జరుగుతుందని భయపెట్టినప్పటికీ రెండు సంవత్సరాలుగా కాశ్మీరు లోయ ప్రశాంతంగా ఉందని చెప్పారు. కశ్మీరీల భారత దేశం ముఖ్య ధారలో కలపడం తక్షణ అవసరం అని గుర్తు చేశారు.
జీవితాంతం స్వయంసేవకులుగా ఉన్నవారు ఇప్పుడు ప్రభుత్వంలో ప్రాముఖ్యత కలిగిన స్థానాల్లో ఉన్నారని, మన దేశ గౌరవం, మన దేశాన్ని చూసే దృష్టికోణంలో స్పష్టమైన మార్పు ఉందని ఆయన అన్నారు., సంఘ ప్రార్థనతో ముగిసిన ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పాల్గొన్నారు.