Home News రాబోయే సంవ‌త్స‌రంలో లక్ష ప్ర‌దేశాల‌కు చేరుకోవ‌డ‌మే ఆర్‌.ఎస్‌.ఎస్ లక్ష్యం – డాక్టర్ మన్మోహన్ వైద్య

రాబోయే సంవ‌త్స‌రంలో లక్ష ప్ర‌దేశాల‌కు చేరుకోవ‌డ‌మే ఆర్‌.ఎస్‌.ఎస్ లక్ష్యం – డాక్టర్ మన్మోహన్ వైద్య

0
SHARE

పానిపట్:  మార్చి 12 నుంచి 14 వ‌ర‌కు జ‌రిగే రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభలు (ABPS) హర్యానాలోని పాటిన‌ట్ జిల్లా సమల్ఖాలో ప్రారంభ‌మ‌య్యాయి. RSS స‌ర్‌ సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్ జీ, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి స‌మావేశాల‌ను ప్రారంభించారు. దేశం నలుమూలల నుంచి 34 సంస్థలకు చెందిన 1474 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రతినిధుల సభ ప్రారంభోత్సవం అనంతరం సహ సర్ కార్య‌వాహ డాక్టర్ మన్మోహన్ వైద్య విలేకరులతో మాట్లాడుతూ.. 2025 నాటికి ఆర్‌.ఎస్‌.ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనుందన్నారు. ప్రస్తుతం సంఘం 71,355 ప్రదేశాలలో నేరుగా పని చేయడం ద్వారా సామాజిక పరివర్తనలో తన పాత్రను పోషిస్తోంద‌ని అన్నారు. వచ్చే ఏడాది నాటికి లక్ష స్థానాలకు చేరుకోవాలని సంఘ లక్ష్యంగా పెట్టుకుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 2020 సంవత్సరంలో కరోనా విపత్తు తర్వాత కూడా సంఘ పని పెరిగింద‌న్నారు. 2020 సంవ‌త్స‌రంలో 38,913 ప్రదేశాలలో 62,491 శాఖలు, 20303 ప్రదేశాలలో సాప్తాహిక్ లు, 8732 ప్రదేశాలలో సంఘ మండ‌లి జ‌రిగాయి, 2023లో ఈ సంఖ్య 42,613 ప్రదేశాలలో 68,651 శాఖలు, 26,877 ప్రదేశాలలో సాప్తాహిక్ లు, 10,412 చోట్ల సంఘ మండ‌లిలు పెరిగాయ‌ని ఆయ‌న తెలిపారు. భౌగోళికంగా సంఘం ప్ర‌కారం దేశవ్యాప్తంగా 911 జిల్లాలు ఉండగా, వాటిలో 901 జిల్లాలలో సంఘం ప్రత్యక్ష పని జ‌రుగుతోంద‌న్నారు. 6,663 ఖండ‌ల‌లో 88 శాతం, 59326 మండలాల్లో 26498 మండలాల్లో నేరుగా శాఖలను కలిగి ఉన్నాయ‌ని తెలిపారు. రాబోయే శతాబ్ది ఉత్సవాల్లో సంఘ పని మ‌రింత పెంచేందుకు, సంఘ సాధారణ ప్రచారక్‌లు, విస్తార‌క్ ల‌తో పాటు 1300 మంది కార్యకర్తలు రెండేళ్లుగా శతాబ్ది విస్తారకులుగా సంఘ విస్త‌ర‌ణ‌లో భాగ‌స్వాముల‌య్యార‌ని తెలిపారు.

 

“భారతదేశ సమాజమంతా ఒక్కటే, అందరూ సమానమే, అందరూ నా స్వంతం, సమాజం కోసం నేను ఏదైనా ఇవ్వాలి” అలాంటి ఆలోచనా భావం, విలువలు సంఘ శాఖ నుండి వచ్చాయి. సంఘ కార్య‌క‌ర్త‌లు వారి రోజువారీ పని నుండి సమయాన్ని వెచ్చించి, అవ‌స‌ర‌మైతే సొంత‌ డబ్బు ఖర్చు చేసి సామాజిక మార్పున‌కు దోహదం చేయడం ద్వారా సంఘ పనిని విస్తరిస్తున్నారు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సంఘ శాఖ నుండి ఒక వ్యక్తి నిర్మాణం జ‌రుగుతుంద‌ని, త‌ర్వాత ఆ వ‌క్తి సమాజంలో జాతీయ భావాల‌ను మేల్కొల్పడం, సమాజాన్ని జాగృతం చేయ‌డం, సామాజిక పరివర్తనలో తన పాత్రను పోషిస్తాడు. నేడు ఆర్‌.ఎస్‌.ఎస్‌ పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని ఆయన అన్నారు. సంఘంతో అనుసందానం కావాల‌ని అనేక మంది సామాజిక మాద్యామాల ద్వారా అభ్య‌ర్థ‌న‌లు వ‌స్తున్నాయ‌న్నారు. 2017 నుండి 2022 వరకు JOIN RSS ద్వారా 7,25,000 యువ‌కులు ఆర్‌.ఎస్‌.ఎస్ లో చేరాల‌నుకున్నార‌ని, వీరిలో ఎక్కువ మంది 20 నుండి 35 సంవత్సరాల వయస్సు గల యువకులు, సామాజిక సేవ కోసం సంఘంలో చేరాలనుకుంటున్నారు. రోజురోజుకూ శాఖలపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. సంఘ‌ శాఖలలో 60 శాతం విద్యార్థి శాఖలు జ‌రుగుతున్నాయ‌న్నారు. గతేడాది కాలంలో 121,137 మంది యువకులు సంఘ‌ ప్రాథమిక శిక్షావ‌ర్గం పూర్తి చేశార‌ని ఆయ‌న తెలిపారు. ఈ ఏడాది దేశ‌వ్యాప్తంగా 109 ప్ర‌దేశాల్లో సంఘ శిక్షావ‌ర్గ‌లు జ‌ర‌గుతాయ‌ని, ఇందులో సుమారు 20 వేల మంది స్వ‌యంసేవ‌కులు శిక్ష‌ణ పొంద‌నున్నార‌ని తెలిపారు.

భగవాన్ మహావీర్ పరినిర్వాణ 2550 వార్షికోత్సవం, ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద్ సరస్వతి జన్మించి 200 సంవత్సరాలు, శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు ఈ మూడింటి నేపథ్యంలో కూడా ప్రతినిధుల సభలో ప్రకటనలు ఆమోదం పొందుతాయి, స్వాతంత్య్ర అమృతోత్స‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌తినిధి స‌భ‌లో తీర్మానం చేయ‌నున్న‌ట్టు డాక్టర్ మన్మోహన్ జీ వైద్య తెలిపారు.