‘సమదృష్టి క్షమత వికాస ఏవం అనుసంధాన మండలి’ (సక్షమ్) గుర్తింపు పొందిన జాతీయ స్వచ్ఛంద సంస్థ. నాగపూర్ లో 2008 లో ప్రారంభించబడినది. దివ్యాంగుల సాధికారికత కోసం ఉద్దేశింపబడినది. పరిశోధన, ఉద్యోగ, న్యాయ, క్రీడా, సాంస్కృతిక రంగాలలో వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది. ..
దృక్కోణం:
సమాజంలోని ప్రతీవ్యక్తీ తమదైన దివ్యత్వాన్ని కలిగి ఉంటారనే విశ్వాసంతో సక్షమ సంస్థ దివ్యాంగుల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవన వికాసానికి తోడ్పడుతూ, తద్వారా సమాజంలో వారికి ఒక గౌరవప్రదమైన స్వావలంబనను కల్పిస్తూ, దేశ పునర్నిర్మాణంలో వారిని భాగస్వాములను మహోన్నత లక్ష్యంతో పనిచేస్తోంది.
దివ్యాంగుల యొక్క సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక జీవన వికాసానికి తోడ్పడుతూ, తద్వారా సమాజంలో వారికి ఒక గౌరవప్రదమైన స్వావలంబనను కల్పిస్తూ, దేశ పునర్నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ‘సక్షమ’ యొక్క ముఖ్య ఉద్దేశం.దీని కోసం జాతీయ మరియు రాష్ట్ర స్థాయిల్లో అనేక కార్యశాలలను (వర్క్షాపులను) సమీక్షలను నిర్వహించడమే కాక అనేక విద్యా, వైద్య సంబంధిత ప్రాజెక్టులను దివ్యాంగుల అభివృద్ధే లక్ష్యంగా నిర్వహిస్తోంది.
క్షమత వికాస ప్రకోష్ఠ ( KVP ):
దృష్టి బాధితులు, అంగవైకల్యం, బుద్ధిమాంద్యం, బధిరత, మానసిక వైకల్యం, రక్త సంబంధిత వైకల్యం, కుష్టు వ్యాధి యొక్క ప్రభావం మొదలైన 7 అంశాల బాధితుల యొక్క విద్య, వైద్య, ఆత్మ విశ్వాసం మరియు సాంఘిక అభివృద్ధి కొరకు పని చేస్తుంది.
దివ్యాంగుల యొక్క విద్యాభివృద్ధి మరియు మానసిక వికాసం కొరకు పాఠశాలలు, వసతి కల్పన, ఆడియో గ్రంథాలయం, బ్రెయిలీలో ప్రచురనలను, బ్రెయిలీ & సైన్ లాంగ్వేజెస్ ట్రైనింగ్ సెంటర్స్, ఇతర కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్ ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది.
స్వావలంబన :
దివ్యాంగుల ఆర్థిక సాధికారికత నిమిత్తం నైపుణ్యాభివృద్ధి సెంటర్లను, వృత్తి విద్యా ట్రైనింగ్ సెంటర్లను, చిన్న తరహా ఉత్పత్తి కేంద్రాలను నిర్వర్తిస్తోంది. దివ్యాంగ సంగీత కళాకారుల కొరకు ప్రారంభించబడిన ప్రాజెక్ట్ ‘స్వరాంజలి’.ఉద్యోగ, ఉపాధి మార్గదర్శక వర్క్షాపులను నిర్వహించడమే కాక ఈ సంస్థతో నిమగ్నమయి ఉన్న వివిధ వ్యాపార వేత్తలు ప్లేస్మెంట్ అవకాశాలను కూడా మెండుగా కల్పిస్తున్నారు.
సాంఘికాభివృద్ధి:
దివ్యాంగుల కొరకు వివాహ వేదిక లను సైతం సక్షమ నిర్వహిస్తున్నది. అక్షరాస్యత, క్రీడలు మరియు సంస్కృతిక వినోద కార్యక్రమాలను సక్షమ నిర్వహిస్తున్నది.
ముందస్తు నిర్ధారణ మరియు నివారణ :
దివ్యాంగుల కొరకు జరుగుతున్న ఈ సమగ్ర ప్రయత్నంలో వైకల్య నివారణ, ముందుగానే వైకల్యాల గుర్తింపు మరియు త్వరితగతిన చర్యలు చేపట్టడం వంటివి విధాయక కార్యక్రమాలుగా సక్షమ ముందుకు సాగుతోంది. ఇటువంటి వాటిలో పతాకస్థాయిలో ‘కార్నియల్ అంధత్వ నివారణ’ కై నిర్వహించబడుతున్న జాతీయ కార్యక్రమం ‘కార్నియా అంధత్వ ముక్త భారత అభియాన్ (CAMBA)’. మన దేశంలో సుమారు 80 లక్షల మంది కంటి చూపు సమస్యలతో బాధపడుతూ ఉండగా అందులో పది లక్షల మంది కార్నియా బాధితులు ఉండడం గమనార్హం. వీరిలో 60శాతం మంది 12 సంవత్సరాలలోపు పిల్లలు ఉండడం ఆందోళన కలిగించే విషయం. సక్షమ ద్వారా దేశవ్యాప్తంగా 10 ఐ-బ్యాంకులు మరియు ఐ కలెక్టింగ్ సెంటర్లు నడుపబడుతున్నాయి.
అవగాహన కార్యక్రమాలు:
వైకల్యం పైన మరియు వికలాంగుల పైన సాంఘిక అవగాహన పెంచడం కోసం సక్షమ ప్రతి సంవత్సరము ఈ క్రింది కార్యక్రమాలను నిర్వహిస్తోంది:
#సక్షమ ఆవిర్భావ దినోత్సవం – జూన్ 20వ తేదీ
# జాతీయ నేత్రదాన పక్షాలు – ఆగస్టు 25 వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు
#జాతీయ సెలబ్రెల్ పాల్సీ దినోత్సవం – అక్టోబర్ 3 వ తేదీ
#ప్రపంచ వికలాంగుల దినోత్సవం – డిసెంబర్ 3వ తేదీ
#లూయీ బ్రెయిలీ జయంతి – జనవరి 4వ తేదీ
# కుష్ఠు వ్యాధి అవగాహన పక్షాలు – జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు.న్యాయ సూచనలు , సలహాలు :
దివ్యాంగుల యొక్క సాధికారికత కోసం అవసరమైన న్యాయ సలహాలను సక్షమ అందిస్తోంది. జాతీయ పార్లమెంటు మరియు రాష్ట్ర అసెంబ్లీ లతో సహా అన్ని ప్రజాస్వామ్య సంస్థల యందు దివ్యాంగులకు తగినంత ప్రాతినిధ్యం కల్పించడం, దివ్యాంగుల చట్టాలను అనుసరించి విధిగా విద్య మరియు ఉద్యోగ రంగాలలో 4% కేటాయింపుల అమలుకు తోడ్పడటం వంటివి వాటిలో ముఖ్యమైనవి. పైన పేర్కొన్న అంశాలపై నిశ్చయాత్మక చర్యల అమలు కొరకు సక్షమ దేశవ్యాప్తంగా అనేక ప్రచారోద్యమ కార్యక్రమాలను చేపడుతోంది.
దివ్యాంగ సేవా కేంద్రాలు:
జిల్లా స్థాయిలో సక్షమ దివ్యాంగ సేవా కేంద్రాలను నడుపుతున్నది. వీటిద్వారా వికలాంగ ధ్రువీకరణ పత్రాలను, పెన్షన్లు, వికలాంగుల ఉపకరణాలు మరియు పరికరాలను DDRC ద్వారా పొందేలా చేయడం మరియు ఇతర ప్రయోజనాలను లబ్ధిదారులకు చేకూర్చడం ఈ కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశం. దివ్యాంగుల అవసరాలను CCPD లేదా కమిషనర్ దృష్టికి తీసుకొని వెళ్లి తక్షణమే నిర్ధారిత చర్యలు చేపట్టడంలో సక్షమ సహాయపడుతుంది. ప్రత్యేక పాఠశాలలు మరియు వైద్య సదుపాయాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం ఈ కేంద్రాల ముఖ్య కార్యాచరణ.
సంక్షేమ కార్యక్రమాలలో
# క్రియాశీల సభ్యులు అవ్వడం ద్వారా
#స్వచ్ఛంద కార్యకర్తలు అవ్వడం ద్వారా
#విరాళాలను అందించడం ద్వారా
#సక్షమ యొక్క వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములు (స్పాన్సర్లు) అవడం ద్వారా
#నేత్రదానం మరియు రక్తదానాల ద్వారా
మీరు కూడా భాగస్వాములగుదురు గాక !
ప్లాట్ 12, రెండవ అంతస్తు, సబితా అపార్ట్మెంట్,రోడ్డు నెం 2, బంజారాహిల్స్, హైదరాబాద్. 500034.
Dr వేదప్రకాష్ (అధ్యక్షులు) – 9959321450
నందనం కరుణాకర్ (కార్యదర్శి) – 9908817904,.