సామజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ సమీపంలోని వాసవినగర్ వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో కుటుంబ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి ప్రధాన వక్తగా హజరైన సామాజిక సమరసత వేదిక అఖిల భారత కన్వీనర్ శ్రీ శ్యాంప్రసాద్ భారతీయ కుటుంభ వ్యవస్థ, కుటుం-సమాజంలో సమరసత యొక్క ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమం పిల్లలు,పెద్దలు, మహిళలు, యువతను ఆకట్టుకుంది.
చిన్నారుల నృత్య రూపకం కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మన పిల్లలకు విద్యతో పాటు సక్రమమైన బుద్ది, వినయవిధేయతలు, భారతీయ సమాజ కుటుంబ విలువలు, సంస్కారాలు గురించి శ్రీమతి లావణ్య గారు వివరించారు.
శ్రీమతి విజయభారతి గారు విశ్లేషణాత్మకంగా వివరించిన సామాజికాంశాలైన ‘వృద్దాశ్రమాల పెరుగుదల ఉమ్మడి కుటుంబాల తరుగుదల’, ‘పిల్లల విదేశీ విద్య.. విదేశ స్థిరనివాసాలు’ ‘అసలుపిల్లలను ఎలా పెంచాలి’, ‘భారతీయ వసుదైక కుటుంబ విలువల పరిరక్షణ’ మొదలైన అంశాలు సభికులను ఆలోచింపచేశాయి. సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ గారి “ఎట్టుండెరా మన ఊరు ఎట్డుండేరా” పాట అందరినీ గతం తాలూకు సామజిక జీవన స్థితి గతుల వైపు తీసుకెళ్ళింది.