
ఖమ్మంలోని బొనకల్ లో పిబ్రవరి 4 రాత్రి సామాజిక సమరసతా సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి ఖమ్మం, కామేపల్లి, రఘు నాథ పాలెం, ఖమ్మం రూరల్, తిరుమలాయ పాలెం, కూసుమంచి, నేల కొండ పల్లి, ముదిగొండ,తల్లాడ, కారేపల్లి మొదలైన 10 మండలాల నుండి అన్ని వర్గాల ప్రజలు 1000 మంది వరకు (600 స్త్రీలు,400 పురుషులు ), 78 గ్రామాల నుండి ఫిబ్రవరి 4 మంగళ వారం ఉదయం ఖమ్మం నగరం లోని ఎంబి గార్డెన్స్ లొ జరిగిన సమరసతా సమ్మేళనానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పూజ్యశ్రీ విజయ భుమానందగిరి స్వామి, ప్రముఖ కవి డా.భాస్కర యోగి, సమరసతా వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ,రాష్ట్ర కార్యదర్శి కీసర జయపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర రావ్, నగర కన్వీనర్ మోహన కృష్ణ, సభ్యులు రామక్రిష్ణా రెడ్డి, నరేంద్ర నాథ్, డి. వెంకటెశ్వర్ రావ్, మిట్టపల్లి క్రిష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.





