Home News నిరంతర ప్రజా సంబంధాల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందన్న ఆశయం తో పనిచేస్తున్న మెదక్ సామాజిక...

నిరంతర ప్రజా సంబంధాల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందన్న ఆశయం తో పనిచేస్తున్న మెదక్ సామాజిక సమరసత వేదిక

0
SHARE
మెదక్ సమరసతా కార్యక్రమాలలో ముందు స్థానంలో నిలుస్తుందని చెప్పవచ్చును. పాఠశాల, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యం తో సహా విద్యాసంస్థలు అన్నిటినీ సనరసతా కార్యక్రమం లో భాగస్వాముల ను చేశారు. చుట్టు ప్రక్కల గ్రామాల లో పండుగల సందర్భంగా సామూహిక పూజలు, భోజనాల ఏర్పాట్లు చేసారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. సమరసత సంస్కర్తల వేషాలు విద్యార్థులచే వేయించారు. అన్ని కళాశాల లలో ఉపన్యాస మాలిక నిర్వహించారు. సంత్ రవిదాస్, వాల్మీకి, గురు గోవింద సింగ్, వివేకానంద, అంబేద్కర్ , సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
బ్యాతోల్, బొల్లారం, కూచన్ పల్లె మొదలైన గ్రామాలలో అంటరానితనం నిర్మూలన కోసం దేవాలయ ప్రవేశం ప్రయత్నాలు చేసి, గృహాలతో సంబంధాలు పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో సమరసత నిర్మాణం చేయడానికి పది గ్రామాలు ఎంపిక చేసి, ప్రత్యక్షం ఆచరణ కోసం సంకల్పం తీసుకున్నారు. ఈ విషయంలో మెదక్ ప్రింట్ మీడియా , వేదిక ఆశయ ఆకాంక్షల కనుగుణంగా సహకరిస్తున్నది.
సమరసతా వేదిక ఆధ్వర్యంలో మెదక్ లో శనివారం రాత్రి జరిగిన సమరసత సదస్సులో..కుల వృత్తులు,కుల పెద్దలకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.25 కులాల వారికి ఒకే వేదిక పై సన్మానం నిర్వహించి సమరసతను చాటి చెప్పడం జరిగింది.వివిధ కులాలకు చెందిన వారు మరియు కులాల భాద్యులు 220 మంది పాల్గొని సమరసతను చాటి చెప్పారు.
సామాజిక సమరసత వేదిక పెద్దలు హాజరై మనమంత సమరసతతో ఎలా ఉండాలో మార్గ దర్శనం చేశారు.ఈ సందర్భంగా బొల్లారం, బ్యాతోలు,మెదక్ క నుండి ఎంపిక చేసిన ఆరుగురు నిరు పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నరేష్ బాబు గారు,రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు,జిల్లా అధ్యక్షులు రవిగారు,ప్రధాన కార్యదర్శి మశ్చేంద్రనాథ్, ధనరాజు,కార్యదర్సి బైరి నర్సింలు గారు,భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కోశాధికారి చోళ పవన్ కుమార్ గారు,సాయిబాబా పాల్గొన్నారు.
శ్రీ అప్పల ప్రసాద్