సంక్రాతి పండుగ వచ్చిందంటే చాలు పల్లెటూరి నుంచి పట్నం వరకు ఊరంతా పండుగ శొభ సంతరించుకుంటుంది. ఈ పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి పిండివంటలు, బోగిపండ్లు, బొమ్మల కొలువులు, దానితోపాటూ అందమైన రంగవల్లికలు. ఇక ఈ పండగకి నెల ముందు నుంచే ముగ్గుల సందడి మొదలవుతుంది. మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి. అలాగే ఈ ముగ్గులు వెనుక కూడా సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.