దరిద్రాణాం కృతే యస్య హృదయం పరితప్యతే |
స మహాత్మేత్యహం వచ్మి తద్విరుద్ధో దురాత్మకః ||
“పేదవారి గురించి ఎవరి హృదయం పరితపిస్తుందో….
పేదవారి మేలు కొరకు ఎవరి మనసు ప్రేరణ కలిగిస్తుందో ఆ వ్యక్తి మహాత్ముడు“….
– స్వామి వివేకానంద
సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో రోడ్ల ప్రక్కన చెప్పులు కుట్టే పేదలను 164 మందిని గుర్తించి ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలోని 500 మంది చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి భగవద్గీత పుస్తకాలు, సంత్ రవిదాస్ చిత్రపటాలు,జీవిత చరిత్ర పుస్తకాలు ఉచితంగా అందచేశారు. రోడ్ల ప్రక్కన చెప్పులు కుట్టేవారి యొక్క 383 కుటుంబాల సామాజిక ఆర్థిక స్థితిగతుల పై సమరసత కార్యకర్తలు సర్వే సైతం నిర్వహించారు.
అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 383 మంది చెప్పులు కుట్టేవారు,చెప్పుల దుకాణాలు నడిపేవారు మరియు 49 మంది వృత్తిలో లేకుండా మిగతా వ్యాపకాల్లో ఉన్నావారు పాల్గొన్నారు.అన్ని కులాల వారు ఈ జయంతిలో పాల్గొన్నారు.ఇలా మొత్తము తెలంగాణ రాష్ట్రంలో 1080 మంది సంత్ రవిదాస్ జయంతిలో పాల్గొన్నారు.
వివిధ జిల్లాల్లో సంత్ రవిదాస్ జయంతి వివరాలు..
వరంగల్:
* ఫిబ్రవరి 19 వ తేదీన వరంగల్ లో రవిదాస్ జయంతి సందర్భంగా శక్తిస్థల్ నుండి కాకాజీనగర్ యోగానిలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు.ప్రముఖ విద్యావేత్త గుజ్జుల నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలుకూరి బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు,మునివాహన సేవకులు శ్రీ రంగరాజన్ గారు పాల్గొని మాట్లాడుతూ సంత్ రవిదాస్ భక్తిమార్గం ద్వారా కులవివక్ష లేని సమాజాన్ని ఆశించారన్నారు. రవిదాస్ బోధనల్లో దయ, కరుణ, మానవత్వం, విలువలు, సామాజిక సమరసత నిర్మాణానికి ఎంతగానో దొహదపడతాయన్నారు.భగవద్గీత 12 వ అధ్యాయం భక్తియోగం గురించి కూడ వారు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో దళితరత్న రవి, ఆర్ ఎస్ ఎస్ విభాగ్ సంఘచాలక్ సంజీవ,సమరసత ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ, సమరసత జిల్లా ప్రముఖ్ లు రఘు, క్రాంతి మరియు 25 మంది మహిళలు పాల్గొన్నారు.20 మందికి రవిదాస్ చిత్రపటాలు,భగవద్గీత పుస్తకాలు అందచేశారు.వంద మంది చెప్పులు కుట్టేవారి సర్వే నిర్వహించారు.25 మంది చెప్పులు కుట్టేవారికి సన్మానం చేశారు.మొత్తం 150 మంది పాల్గొన్నారు.
వికారాబాద్:
వికారాబాద్ లో నిర్వహించిన సంత్ రవిదాస్ జయంతిలో 20 మందికి రవిదాస్ చిత్రపటాలు అందచేశారు.11 మంది చెప్పులు కుట్టేవారికి సన్మానం చేశారు.4 గురు చెప్పుల దుకాణాలు నడిపేవారు,5 గురు మిగతా వ్యాపకాల్లో ఉన్నవారు,ఇతరులు మొత్తం 100 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు మెతుకు ఆనంద్ గారు,వక్తగా సమరసత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వంశతిలక్ గారు పాల్గొన్నారు.
మెట్ పల్లి:
మెట్ పల్లిలో ఫిబ్రవరి 20 వ తేదీన నిర్వహించిన రవిదాస్
జయంతిలో 40 మందికి రవిదాస్ చిత్రాలు,భగవద్గీత పుస్తకాలు,జీవితచరిత్ర పుస్తకాలు అందచేశారు.21 మంది చెప్పులుకుట్టేవారికి సన్మానం చేశారు.50 మంది చెప్పులుకుట్టేవారి సర్వే నిర్వహించారు.సమరసత జిల్లా కార్యదర్శి రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా అప్పాల ప్రసాద్ జీ, అతిథిగా యంఆర్ఓ సత్యనారాయణ పాల్గొనగా మొత్తము 55 మంది పాల్గొన్నారు.
మెదక్
ఫిబ్రవరి 19 వ తేదీన మెదక్ లో జరిగిన రవిదాస్ జయంతిలో 20 మంది చెప్పులుకుట్టే వారికి భగవద్గీత,రవిదాస్ జీవిత చరిత్ర పుస్తకాలు,రవిదాస్ చిత్రపటాలు అందచేశారు.ముగ్గురు చెప్పులు కుట్టేవారికి సన్మానం చేశారు.11 మంది పై సర్వే నిర్వహించారు.సమరసత విభాగ్ సంయోజక్ మత్స్యేంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమరసత మండల కన్వీనర్ సాయిబాబ,జాతీయ ఎస్ సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ పాల్గొనగా మొత్తం 41 మంది పాల్గొన్నారు.ముగ్గురు మహిళలు పాలదగొన్నారు.బాలానగర్ గ్రామంలో 20 మంది యువకులు సంత్ రవిదాస్ చిత్రానికి పుష్పాంజలి సమర్పించారు.భగవద్గీత 12 వ అధ్యాయం శ్లోకాలు శిశుమందిర్ చిన్నారులు పఠించారు.
సిద్దిపేట్
19 ఫిబ్రవరి రోజున నిర్వహించిన రవిదాస్ జయంతి కార్యక్రమంలో 5 గురికి సన్మానం చేశారు.10 మంది చెప్పులు కుట్టేవారు,10 మంది చెప్పుల దుకాణాలు నడిపేవారు,మిగతా వ్యాపకాల్లో ఉన్నవారు 5 గురు మొత్తం 40 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్ సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు కర్నే శ్రీశైలం గారు ప్రసంగించారు.సమరసత జిల్లా అధ్యక్షులు విశ్రాంత ఎస్ ఐ రత్నం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
నిజామాబాద్
ఫిబ్రవరి 21 న నిజామాబాద్ లో జరిగిన రవిదాస్ జయంతిలో 65 మందికి రవిదాస్ చిత్రపటాలు,పుస్తకాలు అందచేశారు.54 మంది చెప్పులు కుట్టేవారి పై సర్వే చేశారు.యం ఆర్ ఓ రాములు గారు.ఇంజనీర్ యం రాములు గారు పాల్గొన్నారు.సమరసత జిల్లా గౌరవాధ్యక్షులు హరిదాస్ఉ,సృజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 160 మంది పాల్గొన్నారు.
సిరిసిల్ల
సిరిసిల్లలో రవిదాస్ జయంతి శోభాయాత్ర రోజున నిర్వహించారు.30 మందికి చిత్రపటాలు అందచేశారు.6 గురికి సన్మానం చేశారు.10 మంది పై సర్వే నిర్వహించారు.సమరసత బాద్యులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 70 మంది పాల్గొన్నారు.సమరసత ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ వక్తగా పాల్గొన్నారు.15 మంది మహిళలు పాల్గొన్నారు.
ఇంకా ఇతర జిల్లాల్లో చెప్పులుకుట్టేవారికి సన్మనాలు,రవిదాస్ చిత్రపటాలు,జీవిత చరిత్ర, భగవద్గీత పుస్తకాలు అందచేసిన వివరాలు.
సికిందరబాద్ లో 15, ఆలేరు -8, రామాయంపేట్-10, జగిత్యాల -20, గాంధీనగర్-5, బర్కత్ పురా-20, కరినగర్-22 ఖమ్మం-16, దుబ్బాక-20, శంకర్పల్లి-5, దిల్సుఖ్ నగర్- 5, జహీరాబాద్ -15 మంది చెప్పులుకుట్టేవారు,దుకాణాలు నడుపుతున్నవారికి రవిదాస్ చిత్రపటాలు,భగవద్గీత,రవిదాస్ జీవిత చరిత్ర పుస్తకాలు అందచేసి సన్మానించారు.
మిగతా జిల్లాల్లో సర్వే వివరాలు.
జగిత్యాలలో 10, బర్కత్ పురా 20 ,కరీనగర్28,ఖమ్మం11,దుబ్బాక 20 మంది చెప్పులు కుట్టేవారి సామాజిక ఆర్థిక స్థితి గతుల పై సర్వే నిర్వహించారు.
మిగతా జిల్లాల్లో మొత్తం పాల్గొన్న వారి సంఖ్య,ఇతర వివరాలు.
ఫిబ్రవరి 19 న సికిందరాబాద్ లో సమరసత కార్యకర్త బలరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రవిదాస్ జయంతిలో సీనియర్ జర్నలిస్ట్ నర్సింగ్రావ్ గారు పాల్గొనగా మొత్తం 24 మంది పాల్గొన్నారు.
ఫిబ్రవరి 18 న ఆలేరులో సమరసత కార్యకర్త శంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విధ్యాధికారి లక్ష్మీనారాయణ పాల్గొనగా మొత్తం 14 మంది పాల్గొన్నారు.
ఫిబ్రవరి 19 న జాతీయ ఎస్ సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ నర్సింలు ఆధ్వర్యంలో రామాయంపేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో 15 మంది పాల్గొన్నారు.
ఫిబ్రవరి 19 న జగిత్యలలో సమరసత ప్రాంత భాద్యులు రమణారెడ్డి,లచ్చన్న గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 60 మంది పాల్గొన్నారు.గాంధీనగర్ లో జరిగిన జయంతి కార్యక్రమంలో 40 మంది పాల్గొనగా అప్పాల ప్రసాద్ జీ వక్తగా పాల్గొన్నారు.
ఫిబ్రవరి 17 న సమరసత బాద్యులు హర్షవర్ధన్ గారి ఆద్వర్యంలో బర్కత్ పురాలో జరిగిన కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ప్రచారక్ దెవెందర్ జీ పాల్గొనగా మొత్తం 50 మంది పాల్గొన్నారు.
ఫిబ్రవరి 19 న కరినగర్ లో సమరసత ప్రాంత సభ్యులు రామారావ్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 32 మంది పాల్గొన్నారు.
ఖమ్మంలో 2 స్థానాలలో 19 న సమరసత ప్రాంత బాద్యులు జైపాల్ రెడ్డి ,ఉపెందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 37 మంది పాల్గొన్నారు.
దుబ్బాక లో బౌద్ధిక్ ప్రముఖ్ రమేష్ ఆధ్వర్యంలో 19 న జరిగిన కార్యక్రమంలో 30 మంది పాల్గొనగా అప్పాల ప్రసాద్ జీ వక్తగా హాజరయ్యారు.
19 న శంకర్పల్లి లో మండల సమరసత కార్యదర్శి నందు ఆధ్వర్యంలో జరిగిన రవిదాస్ జయంతిలో 19 మంది పాల్గొన్నారు.
19 న దిల్ సుఖ్ నగర్ లో సమరసత కార్యకర్తలు భిక్షపతి, శేఖర్, ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 20 మంది పాల్గొన్నారు.
ఫిబ్రవరి 25 వ తేదీన జహీరాబాద్ లో సరస్వతీ శిశుమందిర్ ప్రబంధకారిణీ అధ్యక్షులు విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రవిదాస్ జయంతిలో ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శేషరావ్ గారు, ప్రాంత సమరసత ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు,ప్రసాద్ జీ వక్తగా పాల్గొన్నారు.మొత్తం 30 మంది పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్,రాంనగర్,ఆదిలాబాద్,నల్గొండ,జనగాంలలో ఫిబ్రవరి 19 న రవిదాస్ జయంతి రోజున సంత్ రవిదాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి సమర్పించారు.