సంత్ సేవాలాల్ మహారాజ్‌ను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారు. ఆయన జయంతిని పండుగలా జరుపుకొంటారు. సేవాలాల్ జంతుబలికి తీవ్ర వ్యతిరేకి. మత మార్పిడులను వ్యతిరేకించేవారు. తల్లిదండ్రులు, మహిళలను గౌరవించాలని ప్రజలకు ఆయన బోధించేవారు. ప్రకృతిని, వన్య ప్రాణులను పరిరక్షించడం ద్వారా మానవ జన్మకు సార్థకత చేకూర్చుకోవాలని సూచించేవారు. గ్రామాలు, పట్టణాలకు ఒకటి లేదా రెండు మైళ్ళ దూరంలో నివసించడం ద్వారా ప్రశాంత జీవనం సాగించాలని తోటి లంబాడాలకు సంత్ సేవాలాల్ మహరాజ్ హితవు చెప్పేవారు.