Home News గోసంరక్షణ, హిందూ ధర్మ రక్షణ కొరకు పరితపించిన మహాత్ములు సంత్ సేవాలాల్ మహరాజ్

గోసంరక్షణ, హిందూ ధర్మ రక్షణ కొరకు పరితపించిన మహాత్ములు సంత్ సేవాలాల్ మహరాజ్

0
SHARE

గో రక్షకుడిగా, గోసేవకుడిగా, గో పాలకుడిగా, ప్రకృతి ప్రేమికుడిగా అంతకంటే ముఖ్యంగా హిందూ సమాజం లోని సంస్కృతీ సంప్రదాయాల ప్రచారకుడిగా భావి తరాలకు ఆదర్శంగా అవతార పురుషుడై నిలిచిన వ్యక్తి సంత్ సేవాలాల్. ఆయన తాత తండ్రులు అటు మొఘలులను, సంత్ సేవాలాల్ ఇటు నిజాం నవాబు లను ఎదిరించి, ధర్మ స్థాపన చేశారు.

లంబాడీల ను రకరకాలుగా ప్రలోభపరిచి రాజకీయ నాయకులు ఓట్ల బ్యాంకు గా ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఇతర మతాల వారు బలహీనత లను ఆసరా చేసుకుని మత మార్పిడి కి గురి చేసి, సంత్ సేవాలాల్ బోధించిన ఆశయాలకు దూరంగా ఈ ప్రజలను మోసపుచ్చుతున్నారు. కావున సంత్ సేవాలాల్ మార్గంలో నడుచుకొని, ధర్మ రక్షకులు గా కర్తవ్యం నిర్వహించాలని వక్తలు కోరారు.

సామాజిక సమరసత వేదిక మెదక్ ఆధ్వర్యంలో సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా మండల పరిధిలోని బాలనగర్ పరిసరాల్లోని రెడ్యానాయక్,ఎన్నానాయక్,తిమ్మక్కపల్లి,దూసమడుగు,ఎదురుగడ్డ …ఈ ఐదు తాండల ప్రజలను ఒక దగ్గర కలిపి సేవాలాల్ చిత్రపటంతో ఊరేగింపుగా శోభాయాత్ర,ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.మహిళల గిరిజన సంప్రదాయ ప్రత్యేక నృత్యాలు చేశారు.భోగ్ భండార్,యజ్ఞం నిర్వహించారు.సేవాలాల్ మహరాజ్ కీ జై…జగదాంబమాత కీ జై…భవానీమాత కీ జై…భారత్ మాత కీ జై..నినాదాలతో అంగరంగ వైభవంగా సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి నిర్వహించడం జరిగింది.

సుమారు 200 మంది పాల్గొన్నారు.సమరసత వేదిక మండల కార్యదర్సి సాయిబాబ గ్రామ యువత శివ,నరేష్, మోహన్,యాదగిరి ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతి జరిగింది. సమరసతా జిల్లా అధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి మత్స్యేంద్రనాథ్, కార్యదర్శి బైరం నర్సిములు, చోళ పవన్ తదితరులు పాల్గొన్నారు.