Home News బంజారాలకు బాట చూపిన సంత్ సేవాలాల్

బంజారాలకు బాట చూపిన సంత్ సేవాలాల్

0
SHARE

మహారాష్ట్రలోని జామ్నేర్ తాలూకా గోద్రీలో జ‌న‌వ‌రి 25 నుంచి 30 వ‌ర‌కు “అఖిల భారత హిందూ గోర్ బంజారా, లబానా నాయకడా సమాజ్ కుంభమేళ‌” ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా బంజారాల మార్గ‌ద‌ర్శ‌కుడు, ఆరాధ్య‌దైవుడు శ్రీ సంత్ సేవాలాల్ గురించిన వ్యాసం….

వనవాసీలు అనగానే గుర్తొచ్చేది వారి వేషం, భాష, కళలు. వీటన్నింటిలోనూ వారి తీరు వైవిధ్యంగా ఉంటుంది. వీరి జీవనవిధానం, సంస్కృతి  అనేక ఆచారాలు, కట్టుబాట్లతో కూడి ఉన్నప్పటికీ వాటిని రక్షిస్తూనే, హైందవ ధర్మం గొప్పదనం, విశిష్టతలను తెలిపి, గిరిపుత్రులకు దశ దిశను చూపిన వారు సంత్ సేవాలాల్ మహారాజ్, అందుకే వనవాసీలు  వీరిని దేవుడిగా భావించి పూజిస్తారు.

1739 ఫిబ్ర‌వ‌రి 15న అనంత‌పురం జిల్లా రాంజీనాయ‌క్ తండాలో సేవాలాల్ మ‌హారాజ్‌ జన్మించారు.  వీరి తల్లిపేరు ధర్మిణి, తండ్రి భీమానాయక్. వీరికి చిన్నప్పటి నుంచి అమ్మవారంటే భక్తి ఎక్కువ. చిన్నప్పటి నుంచే గో పోషణ, గో సంరక్షణ చేసేవారు. అలా హిందూ సమాజం యొక్క శ్రద్దా కేంద్రాన్ని కాపాడడంలో వార ముఖ్యపాత్ర పోషించారు. చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కున్న ఆయనకి, వాటినుంచి లభించిన అనుభవాలే ఆయనను శక్తివంతుడిని చేశాయి.

బంజారాల హక్కులు కాపాడడానికి, నిజామ్, మైసూరు పాలకుల దాష్టికాలకు వ్యతిరేకంగా.. 18వ శతాబ్దంలో సాగిన పోరాటంలో సంత్‌ సేవాలాల్‌ పాత్ర ఎంతో కీలకం. అవసరమైనప్పుడు స్వయంగా కత్తిపట్టి కదనరంగంలో శతృసంహారం చేశారు. ఆంగ్లేయులు, ముస్లిం పాలకుల ప్రభావాలకు లోనుకాకుండా, బంజారాలు మతం మారకుండా కాపాడి హిందూ సమాజానికి ఎంతగానో మేలు చేశారు.

ఒకసారి హైదరాబాద్ రాజు నిజాం అలీ సేవాలాల్ జీకి విషం ఇచ్చి చంపాలని ప్రయత్నించాడు. కానీ వారు దేవీ భక్తుడు కావడం వల్ల ఆయనకు ఏవిధమైన హానీ జరగలేదు. కానీ దేవీ భక్తుడి పట్ల అపచారం చేయడంతో నగరమంతా గత్తెర, ప్లేగు వ్యాధి వచ్చి ఎంతో మంది చనిపోయారు.దాంతో రాజు స్వయంగా వచ్చి క్షమాపణ వేడుకుంటే దేవీమాత ఆశీర్వాదంతో మామూలు పరిస్థితి వచ్చింది. అంతటి భక్తి వారిది. అందుకే ఆయనని కారణజన్ముడిగా  ఆరాధిస్తారు బంజారాలు.

మతమార్పిడుల పట్ల గిరిపుత్రులలో అవగాహన కల్పించడం కోసం దేశంలో ఎన్నో ప్రాంతాలలో ఉన్న బంజారాలలో వారు చైతన్యం తీసుకుని వచ్చారు. బంజారాల ఐక్యతకు కఈషి చేశారు. మద్యం సేవించడం, జంతుబలి, దొంగతనాలు, పేదవారిని బాధపెట్టడం వంటి ఎన్నో చెడుపనుల పట్ల వారికి అవగాహన కలిగించారు. అంతేకాదు జాత్ పంచాయితీ అనేపేరుతో హోలీ రోజున అందరూ కలిసేలా ఓ ఏర్పాటు చేశారు. సేవాలాల్ దీక్ష అనే పేరుతో 21 రోజుల పాటు దేవీదీక్షను ప్రోత్సహించారు. నేటికీ ఈ దీక్ష కొనసాగుతోంది.

అడవుల్లో నివసించే బంజారాలు అనాగరికులని చాలామంది అనుకుంటుంటారు కానీ బంజారాల్లో ఉండే హిందూనిష్ట, ప్రమాదాలను ఎదుర్కునే సాహసం, సామాజిక చైతన్యం లాంటి ఫలితంగానే వారి సంస్కఈతి సంప్రదాయాలు, మతవిశ్వాసాలు ధ్వంసం కాలేదు. మిషనీరల కుట్రకు వాళ్లు లొంగలేదు. ఈశాన్య భారంతలో గ్రామీణ తెగలు క్రైస్తవీకరణ చెందినట్లుగా వారు మతం మారలేదు.దాంతో బ్రిటీషర్లు వారిని భారతీయ సమాజం నుంచి విడదీసే ప్రయత్నాలు అనేకం చేశారు. కానీ అలాంటి కీలకమైన సమయంలోనే సేవాలాల్  మహరాజ్ అవతరించి బంజారాలలో హిందూ చైతన్యాన్ని తీసుకువచ్చారు. రాజారామ్ మోహన్ రాయ్ కన్నా ముందు బంజారాలలో ఆధునిక పద్థతుల్లో చైతన్యాన్ని తీసుకువచ్చిన ఘనత సంత్ సేవాలాల్ ది.