Home News పరమ భక్తుడు సంత్ తులసి దాస్

పరమ భక్తుడు సంత్ తులసి దాస్

0
SHARE
  • బొడ్డు సురేందర్ 

ప్రతీ మనిషికి జీవితంలో ఏదో ఒక జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఉంటుంది! సంఘటన తర్వాత మనిషి జీవితంలో అద్బుత మార్పులు జరుగుతాయి!! దీన్నే మనము ఇంగ్లీష్ లో Turning Point అంటూ ఉంటాం. అలాంటి ఒకానోక సంఘటన సంత్ తులసిదాస్ జీవితంలో జరిగిందిదాని గురించి ముందు తెలుసుకుందాం.

ఒక రోజు తులసి పాదుషా కొలువులో రామాయణ ప్రవనచం చేస్తున్నాడు. కాని ఎంత ప్రయత్నించినా కూడా మనస్పూర్తిగా చేయలేకపోవుచున్నాడు!? కారణం..కారణంఏమై ఉండవచ్చుతులసి నూతన వివాహితుడు. క్షణంలో ఎప్పుడూ తన అందాల రాశియైన భార్య రత్నావళి పైననే ద్యాసఅదీ అసలు విషయంఅన్యమనస్కంగానే ప్రవచనం పూర్తి చేశాడుఇంటికెళ్ళాడుభార్య కన్పించడం లేదుచుట్టు ప్రక్కల వారిని అడిగి సమాచారం తెలుసుకున్నాడుభార్య ఏదో అత్యవసర పని మీద పుట్టింటికి వెళ్లిందని, ఇక ఒక్క క్షణం ఆగలేదుబయలుదేరాడు. రాత్రి అయింది. బోరున వర్షంపది మైళ్ళు నడిచి భార్య ఇంటికి చేరాడు. అర్థరాత్రి, చిమ్మ చీకటి, భార్య పైన మేడలో ఉంటుందని తెలిసి చీకట్లో త్రాడనుకొని ఒక పాముని పట్టుకొని పైకెక్కాడుతలుపు  తట్టడం, తలుపు తెరుచుకొంది. ఎదురుగా భార్య ! అత్రుతంగా నిన్ను చేరాలని ఇంత రాత్రి ఇలా వచ్చానని జరిగిందంతా చెప్పాడు. భార్య బయటికి వచ్చి చూస్తే ఎదురుగా చచ్చిరక్తమోడుతున్న పాము కనిపించిందిఆశ్చర్యపోయింది రత్నావళిచీ చీ చీఏమిటండీ మీరు? రక్త మాంసాలతో కూడుకున్న శరీరంపైన ఇంత వ్యామోహమాఇదే వ్యామోహంలో కించిత్తు అయిన రామునిపై ఉంటేఎంత బాగుండేదో”!? అని చీత్కరిస్తుందిఅంతే! ఒక్క క్షణం నిశబ్దతాండవం. తులసి మనసులో పరిపరివిధాల ఆలోచన పరంపరలు! తుచ్చమైన జీవితంపై ఆశలు పటాపంచాలయ్యాయి! జ్ఞానోధయమైంది. ఇక లాభం లేదని రామగానం చేస్తూ పరుగెత్తాడుకాశీ చేరాడు. కఠోర తపస్సు చేశాడు. గొప్ప భక్తుడుగా మారాడు. శ్రీ రాముని, అనుగ్రహం వల్ల లభించిన తన జీవితాన్ని రాముని సేవకే అంకితం చేయాలనీ నిర్ణయించుకున్నాడుఇలా ఉంటుంది జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన !

కాశీ చేరగానే తులసి జీవితమే మారిపోయిందినిత్యం గంగస్నానం చేసి, గంగ నీళ్ళు , రావి చెట్టుకు పోసి , అదే చెట్టు కింద  సాధన చేయసాగాడు. చెట్టు పైన ఉన్న బ్రహ్మ రాక్షసికి, సాధన పరోక్షంగా వరం అయింది ఒక సారి తులసి మందు ప్రత్యక్షమైందిఎవరు నువ్వు? ఏమిటి నీ కథ? అని బ్రహ్మ రాక్షసి ప్రశ్నించగా తానూ తులసిదాస్ నని, ప్రయంగా దగ్గర రాజ్ పూర్ లో ఆత్మారాం దుబే, హులసి దంపతులకు జన్మించానని, అశుభ గడియాలలో పుట్టడం వల్ల నన్ను ఒక దాసికి దానం చేశారని, తర్వాత దాసీ కూడా మరణించడం వళ్ళ బిచ్చమెత్తుకుని బ్రతకానని తన దీన గాధ చెప్పడం, చివరకు నారాయణా నంద స్వామి నన్ను చేరదీసి రామ్ బోలా పేరు పెట్టి తారక మంత్రంతో ఉపదేశం చేశాడని చెప్పాడు. తర్వాత శేష సనాతన స్వాముల చెంత వేద విద్యన్యబ్యసించి రాజపూర్ చేరి బాదుషా కొలవులో చేరినానని చెప్పాడు తన కథను బ్రహ్మ రాక్షసికి.

బ్రహ్మ రాక్షసి ముగ్దురాలై నీ దివ్యమైన కథతో నాకు పాప విముక్తి కల్గిన్చావు కావున నీకు ముక్తి మార్గం కల్గిస్తానని చెప్పిహనుమాన్ ఘాట్వెళ్ళు. అక్కడ రామ కథ నడుస్తుంది.అక్కడ హనుమ అనుగ్రహం కలుగుతుందని చెప్పి అంతర్థతమైంది రాక్షసి. తర్వాత ఆంజనేయుని, శ్రీ రాముల అనుగ్రహంతో తన జీవిత మార్గాన్ని పూర్తిగా రామునికే అంకితం  చేశాడు. క్రమంలోనే  శ్రీ రామ చరిత మానస్ గ్రంథాన్ని రచించారు.

దొంగల్లో మార్పు:

ఒక సారి రాత్రి తులసి కుటిరంలోకి ఇద్దరు దొంగలు చొరబడి పూజాగృహం లోని బంగారం, వెండి పాత్రలు దొంగలించి మూటగట్టి వెల్లడానికి ద్వారం వద్దకు వచ్చారు. అక్కడ ఇద్దరు బటులు కత్తులు పట్టుకొని నిలబడ్డారువారిని చూసి దొంగలు రాత్రంతా కుటీరంలోనే ఉన్నారుఉదయం లేవగానే దొంగలు తులసి కాళ్ల  మీద పది క్షమించమన్నారు. ద్వారం వద్ద సేవకులెవారు ? అని ప్రశించారుతులసి వెళ్లి చూడగా అక్కడ సేవకులు లేరుఆశ్చర్యం ! పరిస్థితి అర్థమైందిసాక్షాత్తు రామ లక్ష్మణులే వచ్చి తులసికి కాపలా ఉన్నారని!

భగవంతునిపై అపారమైన విశ్వాశం

తులసి రోజు అన్నదానం చేస్తుంటారు రోజు అన్నదానం సమయంలో అందరు బ్రాహ్మణులు భోజనం చేసే సమయానికి నూతన వ్యక్తి వచ్చి వరుసలో కూర్చొని”  జై శ్రీ రామ్అని రామ నామాన్ని ఉచ్చారిస్తున్నాడుఅప్పుడా భ్రహ్మణులు భోజనం చేయ నిరాకరిస్తారు. తులసితో వ్యక్తి దుర్మార్గుడు , పాపి, నీచుడుఅతని రాకతో ప్రదేశం అపవిత్రమైందని నిందిస్తారు. అప్పుడు లేదు భక్తులారాఅతడు దుర్మర్గుడే కావచ్చు. కానీరామ నామాన్ని ఉచ్చరించాడు “! ఎక్కడ రామ నామం ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుందంటాడు. అయితే సాక్షం చూపించు అంటారు భక్తులుఅప్పుడు అన్నాన్ని శివాలయం వద్దకు తీసుకెళ్ళి నందీశ్వరుడికి సమర్పించి భక్తీతో వేడుకుంటారు స్వీకరించమని ! ఆశ్చర్యం ! సాక్షాత్తు నందీశ్వరుడే వచ్చి అన్నాన్ని భుజిస్తాడు! ఇంత కన్నా నిదర్శనం ఏముంటుంది? తులసికి భగవంతునిపై ఉన్న విశ్వాసానికి మచ్చతునక సంఘటన.

నా వద్ద మహిమలు లేవు! అంతా రాముని చలవే!

 ఒక సారి ఒక మహిళ పరుగెత్తుకుంటూ వెళ్లి ఏడుస్తూ తులసి కాళ్ళపై పడుతుందితులసిదీర్ఘ సుమంగళిభవఅని దీవిస్తాడుఅయ్యో! మహాత్మా! ఏమని చెప్పను !? నా భర్త ఇప్పుడే మరణించాడునేనెలా సుమంగళిని ? అని ఏడుస్తూ ప్రశ్నిస్తుందిఅయినా మీరేవిధంగా నైనా భర్తను బతికించండి! మహిమ చేసైనా కాపాడండి. అంటుందినా వద్ద మహిలూ లేవుఅంతా రాముని దయనేనీవు తక్షణమే వెళ్లి నీ భర్త చెవిలోరామ నామాన్నిఉచ్చరించు అని చెబుతాడు తులసిపరుగు పరుగున వెళ్లిరామ నామాన్నిపలు సార్లు పలుకగానే ఆశ్చర్యంనిద్ర లోంచి మేల్కొన్నట్లు గా భర్త లేచి కూచుంటాడు!

హనుమాన్ చాలిసా పుట్టుక 

మరణించిన వ్యక్తి మళ్ళి బ్రతుకుతాడా! ఆశ్చర్యంగా ఉందే! విషయం ఆనోటా నోటా పాదుషా చెవిని పడింది. తక్షణం పిలిపించండి. తులసిని నా వద్దకు అని హుకుం జారీ చేశాడు పాదుషా తన బటులకు. తులసి పాదుషా సభలోకి అడుగుపెట్టాడుతులసిదాసు గారుమీ గురించి చాలా విన్నాను. కొన్ని మహిమలు ప్రదర్శించి మమ్మల్ని సంతోష పరచండి అని వేడుకున్నాడు పాదుషా మహిమలా ? నా వద్ద ఎలాంటి మహిమలు లేవు. మంత్రాలు లేవు. అంతా రాముని చలవనేపాదుషా ఎంత చెప్పినా , వేడుకున్నా ఒక్కటే మాట !? నేను నిమిత్త మాత్రున్ని రాజానా దగ్గరేం లేదు. అంతయు రాముడే ! అని ఖరకండగా చెప్పాడు తులసిపాదుషా ఓపిక నశించిందిగర్వంతో హుంకరించాడురాజాజ్ఞనే  దిక్కరిస్తావాఈయన్ని కొరడ  దెబ్బలతో శిక్షించండి. ఆజ్ఞ జారి చేశాడు..!? రాజ భటులు కోరాడ దెబ్బలు వేయడానికి సిద్దమవుతుండగావిచిత్రంఆశ్చర్యంఅద్బుతం ….ఒకే సారి సంభవించాయివందలాది కోతులు తులసి చుట్టూ రక్షణ వలయంలా నిలిచాయి! ఆంజనేయుడే దిగి వచ్చాడు తన భక్తున్ని రక్షించడానికి రాజు దృశ్యం చూసి ఒకింత ఆశ్చర్యానికి , మరోకింత భయానికి గురయ్యాడు.తులసి పాదాలకు నమస్కరించాడు. క్షమించమని వేడుకున్నారు.వెంటనే తులసి కళ్ళు మూసుకుని క్షణంలోనే అప్రయత్నంగా తనను రక్షించిన అంజనేయున్ని స్తుతిస్తూ…  “ ”జయహనుమాన జ్ఞానగుణసాగర జయకపీష తిహులోక ఉజాగరఅంటూ నలబై శ్లోకాలతో గానం చేశాడు. అదే రోజు దేశ విదేశాలలో కోటానుకోట్ల మంది ఆలపించేహనుమాన్ చాలిసాఅయ్యింది!

 భక్తులనిన భగవంతునికెంతో ప్రీతి!

కాశీలో ప్రియదాసు అనే పండితుడు ఉండేవాడుఈయనభక్త విజయమనే గ్రంధం రాశాడునిత్యం దానిని భక్తులకు వినిపించేవాడు. ఒక నాడు గ్రంథం చదువుచుండగా అందులోతులసి దాసుగురించి రాయడం కనిపించింది! ఆశ్చర్యం! నేను ఇది రామలేదే ?! ఇక్కడికెలా వచ్చింది? అని తీవ్రంగా ఆలోచించాడు. చివరికర్థమైంది! ఇది రాముని పనేననిరామ చరిత మానస్తులసి రచించగా, తన భక్తుడు తులసి గురించి రాముడు రాయడంలో ఆశ్చర్యమేముందని ఆనందపరవశుడయ్యాడుఇది భగవంతునికి భక్తునిపై నున్న ప్రేమకు నిదర్శనం.

డబ్బు పాము వంటిది

 ఒక నాడు జహంగీర్ పాదుషా తులసిని తన సభకు రప్పించి ధనమును ఇవ్వబోయ్యాడుతులసి దానిని తిరస్కరిస్తూ, ధనం వల్ల మనసు వక్రీకరించబడును ద్యానమునకవరోదము అని చెబుతాడుతెలుసు స్వామీ! కానీ ధనము మీ వద్ద ఉంచి మంచి కార్యాలు చేయండి అంటాడు, పాదుషాధనము పాము వంటిది! అది రూపంలో వచ్చినా ప్రమాదమే ! అంతేగాక నేను మీ వద్ద చేయి చాపినచో అందులోఉమ్మివేసినా నేను భరించాలి!? అంటాడుపాదుషా సిగ్గుతో తల దించుకుంటాడు!? నిర్మల భక్తి, నిష్కల్మషమైన, నిరాడంబరమైన జీవితాన్ని గడిపి నిరంతరం రామ నమ స్మరణలో తన జీవితాన్ని సార్థకత చేసుకున్న దివ్యాత్ముడు సంత్ తులసి దాస్..

This article was first published in 2021