మా. సర్ కార్యవాహ్ సురేశ్ (భయ్యాజీ )జోషి జారీ చేసిన పత్రికా ప్రకటన అనువాదం
ఎస్ సి / ఎస్ టి అత్యాచార (నిరోధక) చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా హింస చెలరేగడం దురదృష్టకరం. సర్వోన్నత న్యాయస్థానపు తీర్పును అడ్డంపెట్టుకుని సంఘ్ పై దుష్ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిరాధారమైనది, ఖండించదగినది. సర్వోన్నత న్యాయస్థానపు ఈ తీర్పుతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు ఎలాంటి సంబంధం లేదు.
కులం ఆధారంగా ఎలాంటి వివక్ష, అణచివేత ఉండరాదని సంఘ్ మొదటినుంచి చెపుతువస్తున్నది. ఇలాంటి వివక్ష, అణచివేతలను నిరోధించే చట్టాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలి. సర్వోన్నత న్యాయస్థానం ఈ చట్టం విషయంలో వెలువరించిన తీర్పును పునః పరిశీలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం పిటిషన్ ధాఖలు చేయాలని నిర్ణయించడం సరైన చర్య.
ఇలాంటి పరిస్థితిలో సమాజంలో పరస్పర ప్రేమ, విశ్వాసం పెంపొందే విధంగా ప్రయత్నించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మేధావులను, ఆలోచనాపరులకు విజ్ఞప్తి చేస్తోంది. అలాగే ప్రజలు కూడా పుకార్లను, దుష్ప్రచారాన్ని నమ్మకుండా ఒకరిపట్ల మరొకరు స్నేహభావాన్ని నిలుపుకోవాలని కోరుతోంది.
Source :
Press Release on RSS Site in Hindi