Home News పాకిస్తాన్‌కు షాకిచ్చిన సౌది అరేబియా యువరాజు 

పాకిస్తాన్‌కు షాకిచ్చిన సౌది అరేబియా యువరాజు 

0
SHARE

పాకిస్తాన్‌కు దాని సన్నిహిత దేశమైన సౌదీ అరేబీయా నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చలు జరపడానికి సౌదీకి వెళ్లిన పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వాను కలవడానికి సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నిరాకరించారు. భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకుంటున్న సౌదీకి ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కారు వార్నింగ్‌ ఇచ్చిన నేపథ్యంలో సౌదీ యువరాజు పాక్‌ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వాను కలవడానికి సమయం ఇవ్వకపోవడం గమనార్హం.

నివేదికల ప్రకారం పాక్‌ ఆర్మీ చీఫ్‌ బజ్వా, గూఢచారి సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) జనరల్‌ ఫైజ్‌ హమీద్‌ సౌదీ, పాకిస్తాన్‌ దేశాల మధ్య సంబంధాలను బలపర్చడానికి సౌదీ పర్యటను వెళ్లారు. అయితే సౌదీ యువరాజును పాక్‌ ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బాజ్వాను సౌదీ యువరాజు ఉద్దేశపూర్వకంగానే కలవలేదన్న విషయం తెలుస్తోంది. యువరాజుతో సమావేశం కావడంలో విఫలమైన బజ్వా చివరకు సౌదీ అరేబియా డిప్యూటీ రక్షణ మంత్రి మంత్రి, మిలిటరీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్ (త్రివిధ దళాలకు అధిపతి)‌ను కలిశారు. ఎటువంటి చర్చలు లేకుండానే బజ్వా ఇస్లామాబాద్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గతంలో కశ్మీర్‌ సమస్య విషయంలో భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాకపోవడంపై పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషీ సౌది అరేబియాను హెచ్చరించాడు. తమకు మద్దతు ఇవ్వడం లేదంటూ సౌదీపై ఖురేషీ అసహనం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ సమస్యపై సౌదీ ముందుండి పోరాడాలని, ఒక వేళ సౌది సహకరించకపోతే ఒంటరిగానే ముందుకెళ్లాలని ఇమ్రాన్‌ను కోరతానన్నారు. ఇస్లామిక్‌ దేశాలన్నీ కలిసి కశ్మీర్‌ విషయమై భారత్‌పై ఒత్తిడి పెంచాలనే పాక్‌ వ్యూహం. కానీ సౌదీ, యూఏఈ సహా ఏ దేశమూ నోరు మెదపలేకపోవడంతో పాక్‌కు ఎదురు దెబ్బ తగిలింది.
Source: OpIndia