Home News మధ్యప్రదేశ్‌లో ఎస్.సి వ్యక్తిపై ముస్లిం మూకల దాడి

మధ్యప్రదేశ్‌లో ఎస్.సి వ్యక్తిపై ముస్లిం మూకల దాడి

0
SHARE

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగిన ఒక సంఘటనలో,  24 ఏళ్ల ఎస్.సి వర్గానికి చెందిన వ్యక్తికి నిప్పంటించారు. బాధితుడు ధన్‌ప్రసాద్ అహిర్‌వర్‌ పై  పొరుగు వారైన ముస్లింలు దూషిస్తూ దాడి చేశారు. ధన్‌ప్రసాద్ తో పాటు  పొరుగున ఉన్నవారు కూడా వారితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఒక గుంపు తిరిగి వచ్చి అతన్ని సజీవ దహనం చేయడానికి ప్రయత్నించింది. సంఘటనలో ప్రధాన నిందితులైన చుత్తు, అజ్జు పఠాన్, కల్లు, ఇర్ఫాన్ లలో ముగ్గురిని పోలీసులు తరువాత అరెస్టు చేశారు.

సాగర్ జిల్లాలోని మోతి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ధన్‌ప్రసాద్‌కు 60% కాలిన గాయాలు అయ్యాయి. బి.ఎం.సి భోపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉంది.

ధన ప్రసాద్ పై కిరోసిన్ పోసి నిప్పంటించడమేకాక అల్లరి మూక అతని కుటుంబ సభ్యులపైన కూడా దాడిచేశారు. ఒక వివాదం విషయమై నిందితులు చాలా రోజులుగా ధన్‌ప్రసాద్, అతని కుటుంబాన్ని  వేధిస్తున్నారని తెలిసింది. వీరి గురించి ధన్‌ప్రసాద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు ఏమి పట్టించుకోలేదని అంటున్నారు.  

చాలా రోజులగా ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంటోందని, అయినా మోతీనగర్ పోలీసులు దీనిని పట్టించుకోలేదని సాగర్ బిజెపి ఎమ్మెల్యే శైలేంద్ర జైన్ ఆరోపించారు.  రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంతో నేరస్థులు నిర్భయంగా ఉన్నారని ఆయన అన్నారు.

ఈ కేసులో చాలా మంది ఉన్నారని, రాజకీయ కారణాల వల్ల పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మధ్యప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాకేశ్ సింగ్ ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధన్‌ప్రసాద్‌పై 15 నుంచి 20 మంది దాడి చేసినప్పటికీ, మిగతా నిందితులను రక్షించడానికి కొద్దిమందిని మాత్రమే అరెస్టు చేశారు. ముస్లిం మూక  ఎస్.సి వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి జరిగినా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ముస్లిం సంతుష్టీకరణ విధానాన్ని అవలంబిస్తూ నిందితులపై చర్యలు తీసుకోవటంలేదని ఆయన అన్నారు.