ఎస్సీ, ఎస్టీలకు ఎవరు ఏం చేశారన్న చర్చ ఎన్నికల సందర్భంగా విపరీతంగా జరుగుతోంది. కొందరు పనిగట్టుకొని బీజేపీ చేసింది ఏమీ లేదని, అంతా తామే చేశామని, ఆ క్రెడిట్ అంతా తమకే రావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు . కానీ చరిత్ర అంటూ ఒకటి వుంటుంది. ఆ చరిత్ర పుటల్లో ఎవరు ద్రోహులో? ఎవరు సజ్జనులో తేలిపోతుంది.1954 ఉప ఎన్నికల్లో కాంగ్రెసస పార్టీ అంబేద్కర్ ను ఓడించింది నిజం కాదా? అయినా… ప్రతిపక్షాల సహకారంతో అంబేద్కర్ రాజ్యసభ సభ్యులయ్యారు. ఇది మరిచిపోయేంత విషయమా? శ్రీమతి ఇందిరా గాంధీ తగ్గుతున్న ప్రజాబలం పెంచుకోవడం కోసం ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగా వాడుకొని, బాబు జగ్జీవన రామ్ దామోదరం సంజీవయ్యను ముందుంచి ఓటు బ్యాంకుగా వాడుకోలేదా? వాజ్ పేయీ , మోదీ హయాంలో చట్ట సభల్లో రిజర్వేషన్లను పొడిగిస్తూ రెండు సార్లు రాజ్యాంగ సవరణ చేసింది నిజం కాదా? మోదీ హయాంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రామనాథ కోవిందనను రాష్ట్రపతి చేయలేదా? అలాగే గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసింది చరిత్ర కాదా? ఇలాగే మరికొన్ని అంశాలతో తెలుగు రాష్ట్రాల ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. మీ కోసం యథాతథంగా ప్రచురిస్తున్నాం.
1) 1917 కలకత్తా కాంగ్రెస్ జాతీయ సభలో మొదటి సారిగా హైదరాబాద్ కు చెందిన శ్రీ భాగ్యరెడ్డి వర్మ అస్పృశ్య వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను అందరి ముందూ ఉంచారు.బరోడా లో ఉద్యోగానికి రాజీనామా చేసిన డా.బాబా సాహెబ్ అంబేద్కర్ Educate, organise, Agitate అనే మూడు నినాదాలతో అనేక ఉద్యమాలను చేపట్టారు.ఎస్సీ., ల సమస్యలు ప్రజలు ముందు ఉంచారు. 1932లో వార్ధా నుండి ప్రజలలో మార్పుకోసం 11 నెలల పాటు దేశ వ్యాప్తంగా హరిజన యాత్రను గాంధీజీ చేసారు. గాంధీజీ, డా.అంబేద్కర్‌ల మార్గాలు వేరు అయినా ఎవరికి వారు వారి, వారి పద్ధతుల్లో అస్పృశ్యతా నివారణకు కృషి చేసారు.
2) భారత రాజ్యాంగము ద్వారా సామాజిక సమత చట్ట బద్ధం అయింది.డా బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగము తయారీలో డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ కాగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ సభ్యులు ఎక్కువ మంది గల డా బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన గల భారత రాజ్యాంగ సభ ఎస్సీ.,ఎస్టీ.,లకు మూడు రకాల రిజర్వేషన్ లను ఏకగ్రీవంగా కల్పించింది.
3) ప్రధానిపండిత నెహ్రూకు ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్ల పట్ల వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి పునాదులు పడ్డాయి. 1956లో డా.అంబేడ్కర్ తనువు చాలించడంతో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీలకు ముఖ్య నాయకత్వం వహించింది. డా.బాబా సాహెబ్ జీవించి ఉన్నంత కాలం కమ్యూనిస్టు పార్టీ వారిని విమర్శించింది.1952 సార్వత్రిక ఎన్నికల్లో 1954 ఉప ఎన్నికల్లో డా.బాబా సాహెబ్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఓడించింది.అయినా ఆనాటి ప్రతి పక్షాల సహకారంతో బాబా సాహెబ్ రాజ్య సభ సభ్యులు అయ్యారు.
4)శ్రీమతి ఇందిరా గాంధీ తగ్గుతున్న ప్రజా బలం పెంచు కోవడం కోసం ఎస్సీ, ఎస్టీ,వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంది. బాబు జగజ్జీవన రామ్, శ్రీదామోదరం సంజీవయ్య (మొదటి ఎస్సీ ముఖ్య మంత్రి) లను ముందు ఉంచింది.కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్సీలకు నిర్మాణం చేసిన కాలనీలు ఊరికి వెలుపలే ఉన్నాయి.
5) కాన్షీరాం అండతో ఉత్తర ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రానికి కుమారి మాయావతి ముఖ్య మంత్రి అయింది.ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం తగ్గ సాగింది. మహారాష్ట్రలో రిపబ్లికన్ పార్టీ ముక్క చెక్కలు అయింది.
6) శ్రీమతి సోనియా గాంధి నేతృత్వంలోని కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ వర్గాలను విస్మరించి,మైనారిటీలకు= ముస్లిం, క్రైస్తవులకు పెద్ద పీట వేసింది.ప్రధాని డా. మన్మోహన్ సింగ్ దేశంలో అభివృద్ధి పథకాలు ముందుగా ముస్లిం లకు అందాలనీ ప్రకటించారు. సచ్చార్ కమిటీకి, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ నివేదికలకు ఆమోద ముద్ర వేసారు. కాంగ్రెస్ మార్కు సెక్యులరిజం అంటే హిందూ వ్యతిరేకత,ముస్లిం అనుకూలత అయింది.
7) కాంగ్రెస్,కమ్యూనిస్టు నేతృత్వంలో గల దళిత సంఘాలు భారతీయ జనసంఘం భారతీయ జనతా పార్టీలు డా.బాబా సాహెబ్ అంబేద్కర్ వ్రాసిన భారత రాజ్యాంగానికి,ఎస్సీ, ఎస్టీ,రిజర్వేషన్లకు వ్యతిరేకం అని దుష్ప్రచారం చేయడం ప్రారంభించాయి.బతికున్నంత కాలం బాబా సాహెబ్ అంబేద్కర్ ను విమర్శించిన కమ్యూనిస్టులు 1980 తరవాత తమ ఉనికిని పెంచు కోవడం కొరకు డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతులు చేయడం ప్రారంభించారు.అసత్య ప్రచారాలు చేయడంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు ఇద్దరూ సమానమే!
8) 1998 నుండి 2004 వరకు ఆరు సంవత్సరాలు ఆటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రి గా ఉన్నారు.2014 నుండి 10 సంలుగా మోడీ ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఇద్దరి సమయాల్లోనూ చట్ట సభల్లో రిజర్వేషన్లను పొడిగిస్తూ రాజ్యాంగ సవరణ లు రెండు సార్లూ చేయలేదా? అటల్ జీ ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో promotions in reservations చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా?
కాలం పూర్తి ఆయిన జాతీయసఫాయి కర్మచారీ కమీషన్ కాలాన్ని పొడిగించ లేదా?
ప్రైవేటీకరణ శ్రీ పి. వి.నరసింహారావు కాలంలోనే ప్రారంభం అయింది కదా! చైనాలోనే ప్రైవేటీకరణ ప్రారంభం అయింది కదా!
మోడి హయంలో ఒక ఎస్సీని (గౌ.శ్రీ రామనాథ్ కోవింద్), ఒక గిరిజన మహిళను (గౌ.శ్రీమతి ద్రౌపతి ముర్ము)లను రాష్ట్రపతులుగా చేయలేదా? ఈ ఇద్దరి కాలంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దుకు ఏ ప్రయత్నం జరిగింది?
9) బీసీలకు లభించిన రాజకీయ రిజర్వేషన్లలో ముస్లింలు చేరెట్లు చేసింది కాంగ్రెస్ కాదా? ఆమేరకు బీసీలు నష్ట పోయారు.(హైదరాబాద్ కార్పొరేషన్‌లో బీసీ స్థానాల నుండి ముస్లింలు ఎన్నిక అయ్యారు కదా!) కర్ణాటక వంటి కొన్ని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లను ప్రారంభించాయి.
10) సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయత్వంలోనీ రిజర్వేషన్‌లపై గల ఆనాటి రాజ్యాంగసభ ఉప సంఘం ఆ నాడు మతపరమైన రిజర్వేషన్‌లను రద్దు చేసింది. ఆ చర్యను భారత రాజ్యాంగ సభ ఏకగ్రివంగా ఆమోదించింది.నేటి కాంగ్రెస్ నాయకులు ఆనాటి రాజ్యాంగ సభ నిర్ణయాలకు నేడు తూట్లు పొడుస్తున్నారు..మరో సారి దేశ విభజనకు తెర తీస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ,హక్కుల సంక్షేమ వేదిక
తెలుగు రాష్ట్రాలు