Home News అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ బాధ్యత రాజ కుటుంబానిదే : సుప్రీంకోర్ట్ తీర్పు

అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ బాధ్యత రాజ కుటుంబానిదే : సుప్రీంకోర్ట్ తీర్పు

0
SHARE

కేరళలోని ప్రపంచ ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ విషయంలో సుదీర్ఘంగా సాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబానిదేనని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది. ఆలయ నిర్వహణ వివాదంలో జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని ధర్మాసనం రాజ కుటుంబానికి అనుకూలంగా తీర్పు ప్రకారం.. ఆలయ నిర్వహణ బాధ్యత ఇకపై రాజకుటుంబాని దక్కుతుంది.

సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం ఆలయ కార్యకలాపాల నిర్వహణ కోసం 4 వారాల్లో హిందువులను సభ్యులుగా పరిపాలనా కమిటీ, సలహా కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ రెండు కమిటీలు ఏర్పాటు అయ్యే వరకు త్రివేండ్రం జిల్లా మెజిస్ట్రేట్ నేతృత్వంలో ఒక తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసింది.
నూతనంగా ఏర్పాటు చేసే పరిపాలనా కమిటీకి త్రివేండ్రం జిల్లా మెజిస్ట్రేట్ అధ్యక్షుడిగా ఉంటారు. కమిటీలలో రాజ కుటుంబం ప్రతిపాదించిన వ్యక్తితో పాటు, ఆలయ ప్రధాన అర్చకుడు, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక అధికారితో పాటు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు చెందిన అధికారి ఒకరు ఉండాలి. ఒకవేళ కేరళ జిల్లా మెజిస్ట్రేట్ హిందువు కానట్లయితే అతని తరువాతి మరొక ఉన్నత స్థాయి న్యాయమూర్తి ఈ బాధ్యతలు చేపట్టాలి. ఆలయ పూజాదికాలు, క్రతువుల విషయంలో ఆలయ ప్రధానాధికారికే నిర్ణయాధికారం ఉంటుంది. ఆలయానికి పరిపాలనాధికారిని పరిపాలనా కమిటీ నియమిస్తుంది.
నూతనంగా ఏర్పాటు అయ్యే సలహా కమిటీకి కేరళ రాష్ట్ర హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. ఇందులో రాజకుటుంబం ప్రతిపాదించిన వ్యక్తితో పాటు ఒక చార్టెడ్ అకౌంటెంట్ సభ్యులుగా ఉంటారు.
అనాది నుండి అనంత పద్మనాభ ఆలయం బాధ్యతలు కలిగిన ట్రావెన్ కొర్ రాజవంశం.. ఈ విషయాన్నీ ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తూ వస్తోంది  స్వాతంత్రం అనంతరం ట్రావెన్ కొర్  రాజ్యం భారతదేశంలో విలీనం అయిపోయింది. అప్పటి రాజు శ్రీ చిత్ర తిరుణాల్ బలరామ వర్మ, కేవలం పరిపాలనా పరమైన బాధ్యతలు తమకు అప్పగించి, మిగిలిన వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలు ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ వస్తున్నారు. ట్రావెన్-కోర్ రాజ్యం భారతదేశంలో విలీనం సమయంలో జరిగిన ఒప్పందంలో ఈ అంశంపై ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది. 1991లో  చిత్ర తిరుణాల్ బలరామ వర్మ మరణానంతరం అతని సోదరుడు మార్తాండ వర్మ ఈ అధికార బాధ్యతలు కైవసం చేసుకున్నారు. ఈ అధికారంలో తమకు కూడా వాటా కావాలంటూ రాజకుటుంబంలోని ఇతర సభ్యులు పట్టుపట్టడంతో మొదలైన వివాదం అనంతరం పద్మనాభ ఆలయ సంపద వార్తలు బయటకు రావడం వంటి అంశాల కారణంగా మరింత ముసురుకుంది.
ఆ ఆలయ సంపదలు, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్ కోర్ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకోవాలని 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ట్రావెన్ కోర్ రాజవంశీయులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యాజమాన్య హక్కులపై దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా గత ఏడాది ఏప్రిల్‌లో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీమ్ కోర్ట్, జులై 13న ఈ తీర్పు తన తుది తీర్పు వెల్లడించింది.
తమ తీర్పు విషయంలో సమీక్షించాల్సిన అవసరం ఏదీ లేదని సుప్రీం స్పష్టం చేసింది.
Source: PGurus