స్వావలంబనతోనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో సూర భారతి భవన్ లో బీకేఎస్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగ నిపుణుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్, సెక్రటరీ మురళీమోహన్ రెడ్డి, BKS క్షేత్ర కార్యదర్శి శ్రీ డోనూరు రాము జీ, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరంగారావు జోగినపల్లి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి రాజిరెడ్డి, వ్యవసాయ ఆర్థిక పరిశోధన కేంద్రం అఖిల భారత అధ్యక్షుడు, రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ జలపతిరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలపై నకిలీ రైతుసంఘాల చేసిన నిరసనలతో దేశంలోని రైతులకు తప్పుడు సందేశాన్ని అందించారన్నారు. రైతులు స్వావలంబనతోనే భవిష్యత్తులో భారత్ వ్యవసాయ రంగంలో విశ్వగురు స్థానం నిలుస్తోందన్నారు. భారత దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతులకు అధిక ధరలు పొందడానికి భారతీయ కిసాన్ సంఘ్ 40 సంవత్సరాలుగా పోరాటం చేస్తోందని.. భవిష్యత్తులో కూడా పోరాటం కొనసాగిస్తుందిని వారు తెలిపారు.