Home News మ‌ణిపూర్ బాధితుల‌కు అండ‌గా ఆర్‌.ఎస్‌.ఎస్ సేవాస‌మితి 

మ‌ణిపూర్ బాధితుల‌కు అండ‌గా ఆర్‌.ఎస్‌.ఎస్ సేవాస‌మితి 

0
SHARE
దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న సంఘ‌ర్ష‌ణల‌ మ‌ధ్య మ‌ణిపూర్ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) మ‌ణిపూర్ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
సాయుధ కుకీ మిలిటెంట్లు ఇళ్లు తగలబెట్టిన హింసాకాండలో బాధిత ప్రజల కోసం, RSS మణిపూర్ ప్రాంత  సేవా సమితి జూన్ 17 నుండి రాజర్షి భాగ్యచంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ (RBSDC)లో స‌హాయ శిబిరం నిర్వహిస్తోంది. ఇందులో లీటాన్‌పోక్పి, ఐకౌ, సాదు లంపాక్, ఇంఫాల్ ఈస్ట్‌కు చెందిన సాదు యెంగ్‌ఖుమాన్,  మణిపూర్ ప్రభావిత ప్రాంతాలలోని ఇతర ప్రాంతాలకు చెందిన పిల్లలతో సహా 110 మంది ఉన్నారు. సేవా కార్యక్రమాలలో భాగంగా, హింసానంతర జీవనోపాధికి మద్దతుగా, RSS సేవా సమితి మణిపూర్ యూనిట్ బయోరిసోర్సెస్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్, ఇంఫాల్‌లోని సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ వంటి ప్రధాన సంస్థలతో కలిసి నైపుణ్యాభివృద్ధి, స్వీయ- ఉపాధి కార్యకలాపాలు చేప‌ట్టింది.
శిబిరంలో కొవ్వొత్తుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, అగర్బత్తి తయారీపై రెండు ప్రధాన సంస్థలు శిక్ష‌ణ ఇస్తున్నాయి. హ్యూమనిజం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపుదల, మార్గదర్శకత్వం, వ్యవస్థాపకత వంటి అంశాల‌పై శిక్ష‌ణ‌ను అందిస్తోంది.
మణిపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్, సేవా సమితి నిర్వహించే శిబిరంలో ఉంటున్న పిల్లల కోసం రోమి బ్యాగ్ ఇండస్ట్రీ ప్రొప్రైటర్ ఖుంబోంగ్మయుమ్ ధనచంద్ర సింగ్ కూడా 50 స్కూల్ బ్యాగ్‌లను విరాళంగా ఇచ్చారు. మ‌ణిపూర్‌లో హింస చెలరేగినప్పటి నుండి, స్వయంసేవకులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సహాయ, పునరావాస పనుల్లో నిమగ్నమై ఉన్నారు.
నివేదికల ప్రకారం, హింసాకాండలో దాదాపు 200 మంది ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. సుమారు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సీనియర్ RSS కార్యకర్తలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వివిధ సహాయ, పునరావాసం,సేవా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
RSS మణిపూర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లైష్రామ్ జాత్రా సింగ్ నేతృత్వంలోని బృందం జూలై 6న బిష్ణుపూర్ పరిధిలోని ఖోయిజుమంతబి సంద‌ర్శించింది. ఈ సంద‌ర్భంగా జూలై 2న మిలిటెంట్ల చేతిలో ప్రాణాలు కొల్పొయిన నింగోంబమ్ ఇబోమ్చా, హౌబామ్ ఇబోచా, నౌరెం రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను ప‌రామ‌ర్శించి వారి ఒక్కో కుటుంబానికి నిత్యావసర వస్తువులతో పాటు రూ. 10,000 అందజేశారు.
సేవా సమితి మణిపూర్ పాఠశాల,కళాశాలకు వెళ్లే విద్యార్థులకు సుమారు 400 బస్తాల బియ్యం, 500 కిలోల పప్పు, 500 లీటర్ల వంట నూనె, 500 కిలోల ఉప్పు, దోమతెర, దుస్తులు, కూరగాయలు, పాఠ్య‌పుస్త‌కాలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. శిక్షా వికాస్‌ సమితి, మణిపూర్‌లో హింసకు గురైన కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యా పథకాన్ని కూడా ప్రారంభించింది. ఇప్పటివరకు సమితి 60 మంది విద్యార్థులను దత్తత తీసుకుంది. ఇందులో 28 మంది బాలురు, 32 మంది బాలికలు ఉన్నారు. ఇంపాల్‌లోని బాల బిద్య మందిర్ ఉచిత పాఠశాల విద్యను అందిస్తోంది.