Home News నివ‌ర్ బాధితుల‌కు సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో సేవా కార్యక్ర‌మాలు

నివ‌ర్ బాధితుల‌కు సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో సేవా కార్యక్ర‌మాలు

0
SHARE
నివ‌ర్ తుఫాను కారణంగా భారీ వర్షాల‌కు త‌మిళ‌నాడులోని చెన్నై, కాంచీపురం, చెంగ్లెపుట్, కడలూరు, పన్రుట్టి, పజవెర్కాడు, పెరంబర్, మదురంతకం, అరకోన్నం, పుదుచ్చేరి ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగి అక్క‌డి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో త‌‌మిళ‌నాడు సేవాభారతి రాష్ట్ర ప్ర‌భుత్వ‌ సమన్వయంతో సేవా కార్యకలాపాల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. సేవా భార‌తి కార్య‌క‌ర్త‌లు తుఫాన్ బాధితుల‌కు ఆహారం, నీళ్లు, వైద్య సామాగ్రిని, ఇత‌ర వ‌స్తువుల‌ను పంపిణీ చేశారు. వర్షాల వ‌ల్ల  రోడ్ల‌పై విరిగి ప‌డ్డ‌ చెట్లను తొల‌గించారు.
తుఫాను వ‌ల్ల చెన్నైకి సమీపంలో ఉన్న చెంబరంబక్కం సరస్సు తెరవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తంబరం ప్రాంతంలోని క్రోమ్‌పేట్ స్వయంసేవకులు  వెంట‌నే స్పందించి బాధితుల‌కు ఆహారాన్నితయారుచేయడంలో తమ సేవను ప్రారంభించి సుమారు 1000 మందికి ఆహారాన్నిఅందించారు.  కడలూరులో, సేవాభార‌తి కార్య‌క‌ర్తలు తుఫాను బారిన పడిన సుమారు 2000 మందికి ఆహార పొట్లాల‌ను పంపిణీ చేశారు. కాంచీపురంలోని ఇరులార్ వర్గానికి చెందిన 300 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అరకోనం కందలోని రాణిపేటలో సుమారు 200 మందిని ఆశ్ర‌యం క‌ల్పించి, వారికి ఆహారంతో ఇత‌రత్ర‌ అవసరమైన వస్తువులు అంద‌జేశారు. చెన్నైలోని తిరువల్లికేనిలో రోడ్లపై పడిపోయిన చెట్లను తొల‌గించ‌డానికి సేవాభార‌తి కార్య‌క‌ర్త‌లు నిమ‌గ్న‌మ‌య్యారు.
Source : VSK BHARATH