Home News కేర‌ళ : వ‌ర్షాల‌తో ఇండ్లు కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు నిర్మించిన సేవాభార‌తి

కేర‌ళ : వ‌ర్షాల‌తో ఇండ్లు కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు నిర్మించిన సేవాభార‌తి

0
SHARE

వ‌ర్షాలతో ఇండ్లు కూలిపోయి ఇబ్బందుల్లో ఉన్న 17 కుటుంబాల‌కు సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో కొత్త ఇండ్లు నిర్మించి బాధితుల‌కు అండ‌గా నిలిచింది. వివ‌రాల్లో కెళ్తే 2018 ఆగ‌స్టులో కేర‌ళ రాష్ట్రంలోని దేశమంగళం గ్రామపంచాయతీలోని పల్లం గ్రామంలోని కొట్టంబతూర్ లో వద్ద భారీ వర్షం వ‌ల్ల అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. కొండ చ‌రియ‌లు కూలిపోయి దాద‌పు రెండు ఎకరాల భూమి, ఏడు ఇళ్ళు పూర్తిగా, మరొక పది ఇండ్లు పాక్షికంగా కొట్టుకుపోయాయి. సజీవ్, హరినారాయణన్, రంజిత్, శివదాసన్ అనే న‌లుగురు వ్య‌క్తులు వారి ఇండ్ల‌లోని విలువైన పత్రాల‌ను తీసుకురావాడానికి వెళ్లి ప్ర‌మాద‌వ‌శాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఆ కాలనీలో 33 కుటుంబాలు ఉన్నాయి. వారి ఇండ్ల‌న్నీ నేల మ‌ట్ట‌మ‌య్యాయి. దిక్కు తోచ‌ని స్థితిలో ఉన్న‌ వారికి అండ‌గా సేవాభార‌తి ముందుకు వ‌చ్చి ఇండ్లు కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు నిర్మించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ మేర‌కు సేవాభార‌తి ప్ర‌తినిధులు ప్ర‌ణాళిక‌లు కూడా సిద్ధం చేశారు.

     ఇండ్లు కూలిపోయిన‌ 17 మందికి సేవాభారతి భూమిని సేక‌రించింది. 2018 డిసెంబ‌ర్ 22న కేరళ పోలీసు రిటైర్డ్ డిజిపి శ్రీ టి పి సెంకుమార్ లబ్ధిదారులకు ఈ భూమిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ప్రాంత్ సంఘచలక్ మాననీయ శ్రీ పి.ఇ.బి మీనన్ హాజరయ్యారు. అనంత‌రం 2019 ఏప్రిల్ లో స్వామి శంకర విశ్వనాథానంద గారిచే భూమి పూజ నిర్వ‌హించారు. మాన‌నీయ‌ విభాగ్‌ సంఘచలక్ శ్రీ కె ఎస్ పద్మనాభన్ గారి చేత పునాదిరాయి వేశారు. రెండేండ్ల‌లో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ క్ర‌మంలో సేవాభార‌తి అనేక రాజ‌కీయ ఒత్తిళ్ల‌ను ఎదుర్కొంది. మొత్తానికి 2020 న‌వంబ‌ర్ 17న అఖిల భార‌త క్షేత్ర కార్య‌కారిణీ స‌భ్యులు మాననీయ శ్రీ ఎస్ సేతుమాధవ్ గారి చేతుల మీదుగా నూత‌న ఇంటి తాళాల‌ను ల‌బ్దిదారుల‌కు అంద‌జేశారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల ప్రజలు హాజరయ్యారు. టి ఎస్ పట్టాభిరామన్ (సిఎండి కళ్యాణ్ సిల్స్‌), ఓ పి అచుతాంకుట్టి (సిఎండి అశ్వని హాస్పిటల్స్) డాక్టర్ ధర్మపాలన్ (రిటైర్డ్ హెచ్ఓడి వైద్యరత్నం మెడికల్ కాలేజీ), డాక్టర్ రామ్‌దాస్ మీనన్ (సిఎండి ఆత్రేయ హాస్పిటల్) వంటి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నేప‌థ్యంలో కూడా ఈ నిర్మాణాల‌ను పూర్తి చేసేందుకు కృషి చేసిన సేవాభారతిని అభినందించారు. కరోనా రోజుల్లో సామాన్య ప్రజలకు సేవ చేయ‌డం గొప్ప సవాలు అని వారు గుర్తు చేసుకున్నారు. సేవాభారతి చేసిన సేవలకు జాతీయ గుర్తింపును వారు అభినందించారు. అనంత‌రం ఈ ఇండ్ల నిర్మాణాల‌కు కృషి చేసిన వ్య‌క్తుల‌ను( భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌లు, పెయింట‌ర్లు, ఇత‌ర కార్మికుల‌ను) శ్రీ ఎస్ సేతుమాథవన్ గారు స‌త్క‌రించారు.

Source : VSK KERALA