పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) ఇటీవల కాలంలో మద్దతు పెరుగుతోంది. సి.ఏ.ఏ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సమయంలో దానికి వ్యతిరేకంగా అనేక ఆందోళనలు జరిగాయి. దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు సి.ఎ.ఎ సవరణను వ్యతిరేకించాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అనేక మంది అప్పుడు వ్యతిరేకించిన వారే ఇప్పుడు సి.ఎ.ఎ కి మద్ధతు తెలుపుతున్నారు. సి.ఎ.ఎ అవశ్యకతను తెలుసుకుని భారతదేశంలో సి.ఏ.ఏ తప్పని సరిగా అమలు చేయాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వారిలో శిరోమణి అకాలీదళ్ నాయకుడు మంజీందర్ ఎస్ సిర్సా కూడా ఒకరు.
దేశంలో సి.ఎ.ఎ చట్టాన్ని అమలుచేయాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి పౌరులను భారతదేశం తరలిస్తున్న సమయంలో ఆయన ఈ అభ్యర్థన చేశారు.
ఒక మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ “ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో ఈ చట్టాన్ని అవసరం. ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే ప్రజలు ప్రయోజనం పొందడానికి ఇక్కడ సురక్షితమైన జీవితాన్ని గడపడానికి వారి పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వీలుగా చట్టంలో పేర్కొన్న గడువును 2014 నుండి 2021 పొడిగించాలని ప్రధాని, హోంమంత్రిని అభ్యర్థిస్తున్నాను” అని అన్నారు.
I request PM & HM to amend CAA and extend the cut-off date from 2014 to 2021 so that people coming from Afghanistan get benefitted & lead a safe life here and their children are able to study here: Manjinder S Sirsa, President, Delhi Sikh Gurdwara Management Committee &SAD leader pic.twitter.com/6obZJcl6Ur
— ANI (@ANI) August 24, 2021
అయితే శిరోమణి అకాలీదళ్ (SAD) ఇంతకు ముందు పంజాబ్ అసెంబ్లీలో అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన CAA వ్యతిరేక తీర్మానానికి మద్దతు ఇచ్చింది. శిరోమణి అకాలీదళ్ పౌరసత్వ సవరణ చట్టంపై తన వైఖరిని మార్చుకోవాలని దాని మిత్రపక్షం బిజెపిని కోరడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా వెనక్కి తగ్గింది.
మంజీందర్ ఎస్ సిర్సా సి.ఎ.ఎ పై తన వైఖరి మార్చుకున్న నేపథ్యంలో బిజెపి ఐటీ సెల్ జాతీయ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా స్పందించారు. సిఎఎకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు చట్టం ప్రాముఖ్యతను గుర్తించి దాని అమలు చేయమనడం శుభపరిణామం అని అన్నారు.
Courtesy : NEWS BHARATHI