Home News సి.ఎ.ఎ: ఆరుగురు పాకిస్తానీ హిందువుల‌కు భార‌త పౌర‌స‌త్వం

సి.ఎ.ఎ: ఆరుగురు పాకిస్తానీ హిందువుల‌కు భార‌త పౌర‌స‌త్వం

0
SHARE

దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ నుండి  వ‌చ్చిన ఆరుగురు హిందూ వలసదారులకు సి.ఎ.ఎ చ‌ట్టం కింద భారత పౌరసత్వం లభించింది. గ‌తంలో మతపరమైన హింస కారణంగా వారు ఆరుగురూ పాకిస్తాన్ నుండి భార‌త్ కు వ‌చ్చారు. గ‌తేడాది కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (సి.ఎ.ఎ) ద్వారా వారు ప్ర‌స్తుతం భార‌త పౌర‌స‌త్వాన్ని పొందారు. వీరు 1988 నుంచి 2005 వ‌ర‌కు భారతదేశానికి వలస వచ్చినట్టు రాష్ట్ర అధికారులు వెల్ల‌డించారు.

పొరుగు దేశాల్లో మతపరమైన హింస కారణంగా భార‌త్ కు వ‌చ్చిన ఈ హిందూ వలసదారులకు సి.ఏ.ఏ చ‌ట్టం కింద వారికి భారత పౌరసత్వం అందించ‌బ‌డింద‌ని, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేసి వారికి భారత పౌరసత్వ ధృవీకరణ పత్రాలను అందజేశామ‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు.

భారతీయ పౌరసత్వం పొందిన వారిలో భోపాల్‌కు చెందిన నందలాల్, అమిత్ , మాండ్‌సౌర్‌కు చెందిన అర్జుందస్ మంచందాని, జైరామ్ దాస్, నారాయణ దాస్ సౌశల్య బాయి ఉన్నారు.

ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లోని హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ లేదా క్రైస్తవ మ‌తానికి చెందిన వారు ఆయా దేశాల్లో మ‌త‌ప‌ర‌మైన హింస‌కు గురై భార‌త్ దేశానికి వ‌చ్చిన వారికి భార‌త పౌర‌స‌త్వం క‌ల్పించ‌డానికి వీలుగా కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం పౌర‌స‌త్వ చ‌ట్టానికి స‌వ‌ర‌ణలు చేసింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం భారతదేశంలోకి వ‌చ్చిన వారు ప్ర‌స్తుతం సి.ఏ.ఏ చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్న త‌ర్వాత ప్ర‌భుత్వం అన్ని ప‌త్రాల‌ను ప‌రిశీలించి వారికి భార‌త పౌర‌స‌త్వం క‌ల్పిస్తుంది.

Source : ORGANISER