సమాచార భారతి ఆధ్వర్యంలో అప్రతిహితంగా నాలుగవ సంవత్సరం “సోషల్ మీడియా సంగమం” విజయవంతంగా ముగిసింది. 300మందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తలు, ప్రముఖులు, ఔత్సహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగ్యనగరంలోని కేశవ మెమోరియల్ కళాశాల ప్రాగణంలోని పటేల్ సమావేశ మందిరంలో ఉదయం జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ అంశంగా “స్వాతంత్య్ర అమృత మహోత్సవం” అనే అంశంపై వక్తలు దిశానిర్ధేశం చేశారు. సమాచార భారతి అధ్యక్షులు శ్రీ గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పాశ్చత్య దృక్పథంతోనే మన చరిత్రను మన సంస్కృతిని దర్శిస్తున్నామనీ, ఈ దృక్పథం మారాలని పిలుపునిచ్చారు. గోడ పత్రికలతో మొదలైన సమాచార వితరణ ఇప్పుడు విప్లవాత్మక మార్పు చెంది, ఇంట్లోకి, చేతిలోకి వచ్చేసిందన్నారు. ఈ “INFORMATION AGE” లో సరైన సమాచారం ప్రజలకు నిష్పాక్షికంగా అందవలసిన సమయం వచ్చిందనీ, అదే లక్ష్యంతో సమాచార భారతి పని చేస్తోందని తెలిపారు. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలోనే సమాచార భారతి పని చేస్తుందని తెలిపారు.
అనంతరం ముఖ్య వక్త శ్రీ ప్రశాంత్ పోలే గారు మాట్లాడుతూ స్వాతంత్య్ర అమృత మహోత్సవం సందర్భంగానైనా మన చరిత్ర మనం తెలుకోవాలనీ, మరుగునపడ్డ మన నుంచి కుట్రపూరితంగా దాచిపెట్టబడ్డ అనేక మంది స్వాతంత్య్ర వీరులు పోరాటాల గురించి, వారి త్యాగాల గురించి తెలుసుకోవాలని… సోషల్ మీడియా కార్యకర్తలు ఆ పనికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. రాజామార్తండ వర్మ, వేలు నచ్చియార్, మహరాణీ అబ్బక్క వంటి అనేక మంది వీరులు, వారి అసలు చరిత్ర మనమే వెతికి వెలికి తీయాలని, ఆ బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. నిజానికి భారత దేశం నుంచి ప్రపంచంలో నలుమూలలకి వాణిజ్యం పడవల ద్వారా ఎన్నో శతాబ్దాల నుంచి జరగుతూనే ఉందనీ, పోర్చుగీసు వాస్కొడిగామా భారతదేశాన్ని కనిపెట్టాడని, చరిత్రలో చెప్పడం ఎంత హస్యాస్పదమో అని వాపోయారు. 1608 ప్రాంతంలో లాటిన్ అమెరికా ప్రాంతంలో దాడి చేసి వశపరుచుకున్న తరహాలో భారత పశ్చిమ తీరంపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తే రాణీ అబ్బకన్న నేతృత్వంలోని సైన్యం వారిని దిమ్మ తిరిగేట్లు ఒక నిర్ణయాత్మక విజయాన్ని సాధించిందని గుర్తు చేశారు. జైనురాలైన రాణీ అబ్బక్క శత్రువులని నిర్ధాక్షిణ్యంగా చంపేయ్యమని ఆదేశించిందంటే, ఆ శతృముకల ద్వేషం ఎంతంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చన్నారు. ఆ యుద్ధం ఎంత కీలకమైనదీ అంటే పోర్చుగీసు వారు మళ్ళీ అటువైపు కన్నేత్తి చూడలేదు, ముంబై నుంచి గోవా ప్రాంతం వరకే ఉండి దిగువకు వెళ్లే ధైర్యం చేయలేదని చెప్పారు. రాజా మార్తండవర్మ దెబ్బకి కెరళా ప్రాంతానికి ఆధీనంలోకి తీసుకుందామని ప్రయత్నించిన యూరోపియన్ మదం అణిగి పోయింది. యూరోపియన్ల సైన్యాన్ని చిత్తుగా ఓడించిన మొదటి భారతీయ సైన్యం ఉనికి వారి ప్రభావం మనకు పూర్తిగా తెలియదు, కానీ 100 సంవత్సరాల తర్వాత జపాన్ రష్యాపై సాధించిన విజయాన్ని మాత్రం గొప్ప విజయంగా కీర్తిచడం అలవాటైపోయిందన్నారు. తమిళనాడుకు చెందిన రాణి నచియార్ సైన్యం విరోచిత, వ్యూహత్మక ఆత్మాహుతి దాడికతో శివగంగ ప్రాంతం ఎలా స్వాతంత్య్ర గాలులు పీల్చిందో మీలో ఎంద మందికి తెలుసు? ఈ విధంగా దేశం నాలుగు చెరుగులా అనేక విజయగాధలు ఉన్నాయని, ఆ గాథలను తెలుసుకొని పరిశోధించి ప్రజలను తెలియజేయాల్సిన బాధ్యత సోషల్ మీడియాదే అన్నారు. బ్రిటీష్ వారు మన దేశాన్ని ఎలా దొచుకున్నారో అందరికీ తెలుసు.. అయినా మన చరిత్రలో ఆ వివరాలు పూర్తిగా లేకుండా చేశారన్నారు. బ్రిటిష్ వాళ్లు చేసిన సర్వేలోనే మన భారతీయులు అక్షరాస్యత దాదాపు 100శాతంగా ఉండేదని ఇంగ్లీష్ మాధ్యమం అనే భ్రమలో మన అక్షరాస్యతలను కొలవరాదని గుర్తు ఏశారు. ఆరోగ్యం విషయంలో ఆయుర్వేదాన్ని తక్కువ చేయడం, వేరే న్యాయ చట్టాలను తీసుకొచ్చి మన పంచాయితీ న్యాయ విధానాన్ని తీసుకొచ్చి భారతీయ అస్తిత్వాన్ని ప్రశ్నించారనీ, అదే ఉద్దేశంతోనే మనమూ ఆలోచించరాదని, తగిన మౌలిక మార్పులు జరగాలని వక్త ప్రశాంత్ పోలే పేర్కొన్నారు. చిత్రకళ, నాటక కళ ఇలా కళారంగంలో మన “స్వ” తెలుసుకోవాలని, హిందూ రసాయన శాస్త్రం అనే పుస్తకం ప్రచురించి అప్పటి దార్శనికులు మన దేశ శాస్త్రపాండిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని, ఆ చరిత్రనే మనం వెలికి తీసి ప్రజల ముందుకు తేవాలని పిలుపునిచ్చారు.
అనంతరం మరో వక్త శ్రీ మామిడి గిరిధర్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత చరిత్ర వక్రీకరణ గురించి ప్రత్యేకంగా ఎత్తిచూపారు. స్వరాజ్యం, స్వధర్మం, స్వాభిమానం కోసం సామాన్య ప్రజానీకం ప్రాణాలకు తెగించి పోరాటం చేశారనీ, అయితే రజాకార్ల దాష్టీకాన్ని, ప్రజల తిరుగుబాటనీ ఒక “ఇజం” చట్రంలో బిగించేశారని గుర్తుచేశారు. స్వధర్మ రక్షణలో కదిలిన సామాన్య ప్రజానీకం వారికి సహయ సహకారాలు అందించిన కొద్ది మంది సంస్థానాధీశులను కూడా ఒక “ఇజం” అద్ధంలో చూపించేయటం ఎంత వరకూ సబబూ అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతంలో గడప గడపకి ఈ దారుణాలు సాక్ష్యం కనిపిస్తోంది. ముందు తరాలనీ కదిలిస్తే సాక్ష్యం పలకడం కూడా మొదలవుతుందని గుర్తు చేశారు. ఈ కార్యకర్తల సమూహమే అప్పటి విదేశీ మత దౌష్ట్యాలు రజాకార్ పేరుతో జరిపిన దారుణాలు డాక్యుమెంట్ చేయడం మొదటు పెట్టాలనీ పిలుపునిచ్చారు. ఒక వీడియో ఇంటర్వూ తీసుకునే లేదా అప్పటి అంశాలను ఒక కాగితం మీద రాయించో ఆ ద్వేష్ట్యాలను నేటి తరాలకు తెలియజెప్పాలని, ఇది అత్యంత అవశ్యకమైన పని అని అన్నారు. ఈ సంగమంలో ప్రతీ కార్యకర్త ఒక వెయ్యి సాక్ష్యాలు తేవాలనీ పిలుపునిచ్చారు. 80 శాతం ఉన్న హిందువులపై ఇన్ని దారుణాలు జరిగినట్లు సజీవ సాక్ష్యాలు ఉన్న స్వాతంత్య్ర చరిత్రలో కొన్ని దేశ వ్యతిరేక శక్తులు, Annexation of hyderabad అన్న పదాన్నే ఇప్పటికీ వాడుతున్నారనీ గుర్తు చేశారు. కొందరు కమ్యూనిస్టు నాయకులు హైదరాబాద్ ప్రాంతాన్ని వేరే స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకోవడానికి స్టాలిన్ ను కలిసిన విషయాన్ని సముద్ర తీరం లేకపోవడం వల్లనే స్టాలిన్ వ్యూహత్మక మద్దతు ఇవ్వక పోవడం వల్లనే ఆ ప్రమాదం జరగలేదనీ గుర్తు చేశారు. ఇంతటి దేశ ద్రోహి అంశం ఎందుకు మరుగున పడిందో తెలుసుకుని ఆ విషయాలను సమాజంలోకి తీసుకు రావాలని అన్నారు.
రెండో విభాగంలో ముఖ్య వక్తులుగా పాల్గొన్న మాయంక్ అగర్వాల్ కాశ్మీర్ ఫైల్ చిత్రం గురించి ప్రస్తావిస్తూ 30ఏళ్ల క్రితం జరిగిన దారుణాన్ని కొందరు ఉద్దేశ్య పూర్వకంగా దాని పెడితే ఈ సినిమా మాధ్యమం ద్వారా మళ్లీ ఎలా చర్యకు, చర్యకు దారితీయగలిగామొ తెలిపారు. డా. సంతోష్ కుమార్‌గారు, ఆరోగ్యరంగంలో జరిగిన అనేక విప్లవాత్మక ఆలోచనలను సదశ్యులతో పంచుకున్నారు. దివ్యాంగులకు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన అనేక సౌకర్యాలను సభికుల దృష్టికి తెచ్చారు. ‘సక్షం’ అనే సంస్థ ద్వారా సమాజహిత కార్యక్రమాలను సభికులకు పరిచయం చేశారు. నందకూమార్ పూజారీ గారు సరైన ఆహారం ప్రాముఖ్యతను సభికులకు తెలియజేశారు. మన భారతీయ వ్యవసాయ విధానంలో జరగాల్సిన సమూల మార్పుల గురించి గ్రామ భారతీ జరిపే కార్యక్రమాల గురించి వివరించారు.
తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ అమర్‌నాథ్ గారు మాట్లాడుతూ సమాచార భారతి చేపట్టిన ‘చిత్ర భారతి’ వారి కాకతీయ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ‘గొల్కొండ సాహితీ మహోత్సవం’ గురించి వివరించారు. ఆలోచన నుంచి ఆచరణ వరకు ఔత్సాహికులకు సమాచార భారతి ఏ విధంగా సహయకారిగా ఉంటుందో వివరించారు. ‘నారద జయంతి’ సందర్భంగా జర్నలిస్టులను సత్కరించే సంప్రాదాయం ఉందని చెప్పారు. దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ శ్రీ ఆయూష్ గారు “ఆర్.ఎస్.ఎస్ విధానంతో భవిష్య భారత నిర్మాణం” అన్న అంశంపై మాట్లాడుతూ అందరినీ కలుపుకుంటూ పోతూ ‘నా’ నుంచి ‘మన’ అనే భావనను వ్యాప్తి చేసేలా ఆర్.ఎస్.ఎస్ పని చేస్తోందని తెలిపారు. సమాజంలో చైతన్యం తేవడమే ఆర్.ఎస్.ఎస్ విధానం అని ‘దేశంలో ఉన్న వారందరూ హిందువు లేనని వారందరు ఆత్మీయులేననీ’ శ్రీ గురూజీ అన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.