ఆయోద్యలో భగవాన్ శ్రీరామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి శ్రీ చంపత్ రాయ్ వెల్లడించారు.
”మందిర నిర్మాణానికి ఎంతో మంది భక్తులు పట్టుదలతో తమ మద్దతును తెలిపారు. ఇప్పుడు జనజాగరణలో భాగంగా లక్షల మంది కార్యకర్తలు సమాజంలోకి వెళ్లినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందించేందుకు ముందుకు రానున్నారు. సాధరణంగా భగవంతుని పనికి సంపద అటంకం అవ్వదు. సమాజం కూడా కార్యకర్తల అంకితభావాన్ని అంగీకరిస్తుంది, ఆర్థిక అంశంలో పారదర్శకత చాలా ముఖ్యం, పారదర్శకతను కొనసాగించడానికి మనకు పది రూపాయలు, వంద రూపాయలు, వెయ్యి రూపాయి కూపన్లు, రశీదులు ముద్రించబడతాయి. ప్రజలు ఇచ్చేదానికి అనుగుణంగా కార్యకర్తలు కూపన్లు లేదా రశీదులు ఇస్తారు. జనజాగరణ కార్యక్రమంలో రామ మందిర చిత్రపటం కోట్ల మంది ఇండ్లలోకి చేరనుంది.
సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న తీర్పులో శ్రీ రామ జన్మభూమి ఆలయానికి సంబంధించిన చరిత్రలోని సత్యాలను సుప్రీంకోర్టు అంగీకరించింది. మందిర నిర్మాణం కోసం కోర్టు ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం ‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 5న ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ విషయాల్ని అందరికీ విదితమే.
రామజన్మ భూమి ఆలయ నిర్మాణానికి అహ్మదాబాద్‌కు చెందిన చంద్రకాంత్ సోంపురా జి బాధ్యత వహిస్తున్నారని, ఆయన 1979 నుండి జన్మభూమి ఆలయ నిర్మాణాన్ని చూసుకుంటున్నారని ట్రస్ట్ కార్యదర్శి శ్రీ చంపత్ రాయ్ తెలిపారు. ‘లార్సెన్ టుబ్రో కంపెనీ’ కి ఆలయ నిర్మాణ పనులను అప్పగించారని, ఆ సంస్థకు సలహాదారుగా ‘టాటా కన్సల్టెంట్ ఇంజనీర్స్’ వ్యవహరిస్తుందని తెలిపారు.