Home News 40 సంవ‌త్స‌రాల త‌ర్వాత శ్రీరంగం ఆలయ ఆస్తుల పున‌రుద్ధ‌ర‌ణ‌

40 సంవ‌త్స‌రాల త‌ర్వాత శ్రీరంగం ఆలయ ఆస్తుల పున‌రుద్ధ‌ర‌ణ‌

0
SHARE
  • కోర్టు తీర్పుతో ఆల‌య ప‌రిధిలోని దుకాణాల‌ను తొల‌గించిన హెచ్ఆర్ & సిఈ శాఖ

    శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్నరాజగోపురానికి చెందిన ఆస్తులను వ్యాపారాల కోసం ఆక్రమించిన దుకాణాలను తొల‌గించాల‌ని కోర్టు ఉత్తర్వులతో 40 సంవత్సరాలుగా ఆక్రమణలకు గురైన ఆస్తులు తిరిగి ఆల‌యానికి పున‌రుద్ద‌రించ‌బ‌డ్డాయి. వివిధ వాణిజ్య, వ్యాపారాల కోసం రంగనాథస్వామి ఆలయ రాజగోపురం ముందున్న నాలుగు అడుగుల హాళ్ళను ఆక్రమించి గ‌త కొన్నేండ్లుగా దుకాణాలను నిర్వ‌హించారు.అయితే 2018 సంవత్సరంలో మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయంలోని వసంత రాయర్ హాల్లో  ఉన్న దుకాణాల్లో మంటలు చెలరేగాయి. దీంతో దేవాలయానికి చెందిన ఆస్తిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని హిందూ రిలిజీయ‌న్ & చారిట‌బుల్  ఎండోమెంట్స్ (HR&CE) శాఖ నిర్ణయించింది. ఈ ప్రాతిపదికన తో దేవాలయాల లోపల, వెలుపల ఉన్న హాళ్ళలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగించబడ్డాయి.అదే విధంగా శ్రీరంగం రంగనాథస్వామి ఆలయానికి చెందిన ప్ర‌దేశాల్లో ఉన్న దుకాణాలను ఖాళీ చేయాల‌ని దుకాణ యజమానులకు హెచ్ ఆర్ అండ్ సి విభాగం నోటీసులు జారీ చేసింది. కానీ కొన్నేళ్లుగా ఆలయానికి చెందిన ప్ర‌దేశాల‌లో తమ దుకాణాలను నడుపుతున్న వారు దీనికి వ్యతిరేకంగా కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

    మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్‌లో విచారణకు వచ్చిన ఈ కేసు, వందల సంవత్సరాల పురాతనమైన ఆలయానికి చెందిన ప్ర‌దేశాల‌లో దుకాణాలు నిర్వ‌హిస్తున్నార‌ని, ఇది దేవాలయ నిర్మాణ ప్రాముఖ్యతను దెబ్బతీస్తోంద‌ని హెచ్ ఆర్ అండ్ సి ఆదేశించడం సరైనదని కోర్టు తీర్పునిచ్చింది. వాటిని రక్షించడం అధికారుల విధి కాబట్టి దుకాణాలను ఖాళీ చేయాల‌ని, వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ స్తంభాలు వాణిజ్య ప్రయోజనం కోసం నిర్మించబడలేదని తెలుపుతూ వ్యాపారుల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

    ఈ మేర‌కు గ‌త మే 30లోగా దుకాణాలను ఖాళీ చేయాలని HR&CE శాఖ దుకాణ నిర్వ‌హ‌కుల‌ను ఆదేశించింది. కానీ వ్యాపారులు దుకాణాలను ఖాళీ చేయకపోవడంతో మే 31న హెచ్‌ఆర్ అండ్ సి విభాగం దుకాణాల‌ను తొల‌గించే ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. ఆల‌య ప‌రిధిలో ఉన్న అమ్మ మండపం లో రెండు హాళ్లలో ఉన్న 3దుకాణాల‌ను అధికారులు తొలగించి చుట్టూ కంచె నిర్మించారు.

    Source : the commune