Home News “శబరిమల దేవస్థానం బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదు” – స్పష్టం చేసిన కేరళ హైకోర్టు

“శబరిమల దేవస్థానం బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదు” – స్పష్టం చేసిన కేరళ హైకోర్టు

0
SHARE
శబరిమల దేవస్థానం విషయంలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేవస్థాన దైనందిన వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. నిరసనల్లో పాల్గొన్న అయ్యప్ప భక్తుల అరెస్టుపై దాఖలైన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ప్రభుత్వం శబరిమల దేవస్థానం బోర్డుకి ఈ అంశంలో ఎటువంటి సూచనలు ఇవ్వజాలదు అని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. దేవస్థానం బోర్డు కార్యకలాపాలలో ప్రభుత్వ అనవసర జోక్యం మీద అక్టోబర్ 30వ తేదీన దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా నవంబర్ 17వ తేదీ నుండి ప్రారంభం కానున్న మండలం-మకరవిలక్కు కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి కూడా తెలియజేయాలంటూ ఆదేశించింది.
గతంలో తిరువనంతపురానికి చెందిన టీఆర్ రమేష్ అనే వ్యక్తి శబరిమల ధార్మిక వ్యవహారాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి మౌఖిక, రాతపూర్వక ఆదేశాలు పాటించకుండా దేవస్థానం బోర్డుకి సూచన ఇవ్వాల్సిందిగా దాఖలు చేసిన పిటిషన్ మీద గతంలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రులు శబరిమల ఆలయ ధార్మిక వ్యవహారాల్లో కలుగజేసుకుంటున్నారని, అది చట్టవ్యతిరేకమని పిటిషనర్ కోర్టుకి తెలియజేశాడు.
అటువంటి వ్యవహారాల్లో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు దేవస్థానం బోర్డుకే వదిలివేయాలని, శబరిమల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే విషయంలోనూ కేరళ ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి బోర్డుని నియంత్రించకుండా చూడాల్సిందిగా పిటిషనర్ కోర్టుని కోరాడు.
Source: Organiser