Home News కాశ్మీర్: LOC సమీపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహా ఏర్పాటు

కాశ్మీర్: LOC సమీపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహా ఏర్పాటు

0
SHARE

కాశ్మీర్ లోయ‌లోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఫిబ్రవరి 14న ‘అమ్హి పుణేకర్’ (వీ పుణేకర్) స్వచ్ఛంద సంస్థ తెలిపింది. కిరణ్, తంగ్‌ధర్-తిత్వాల్‌లోని రెండు ప్రదేశాలలో విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు.

కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ సాగర్ దత్తాత్రేయ దోయిఫోడే అనుమతితో ఈ విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. శివాజీ విగ్రహాన్ని రోజూ చూస్తూ శత్రువులతో పోరాడుతున్న సైనికులను ప్రేరేపించడం లక్ష్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అటకేపర్ స్మారక్ సమితి అధ్య‌క్షుడు అభయ్‌రాజ్ షిరోల్, వీ పుణేకర్ ఎన్జీవో అధ్యక్షుడు హేమంత్ జాదవ్ ఈ కార్యక్రమానికి రూప‌క‌ల్ప‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా హేమంత్ జాదవ్ మాట్లాడుతూ.. విగ్రహ ప్రతిష్ఠాపన పనుల భూమి పూజను మార్చి నెలాఖరులోగా నిర్వహిస్తామన్నారు. శివరాయల అడుగుజాడలతో పవిత్రంగా మారిన రాయగడ, తోరణ, శివనేరి, రాజ్‌గఢ్, ప్రతాప్‌గడ్ కోటల నుంచి మట్టి, నీరు తరలిస్తామన్నారు. అమ్హి పుణేకర్ NGO ద్వారా భూమి పూజ కోసం కాశ్మీర్‌కు తీసుకువెళ్ల నున్న‌ట్టు తెలిపారు.

అభయరాజ్ శిరోలె మాట్లాడుతూ.. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ తన వ్యూహాలు, సాహసోపేతమైన చేష్టలతో శత్రువులను తరిమికొట్టారు. ప్రపంచంలోని వివిధ దేశాలు ఆయన గెరిల్లా యుద్ధ పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఆ స్ఫూర్తిని అందించేందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఏర్పాటు చేస్తున్నారు. శివరాయల ఆదర్శాలు, విగ్రహం ద్వారా ప్రేరణతో సరిహద్దులోని భారత సైనికులకు అందుతాయి.” అని అన్నారు.

అయితే 2022 జ‌న‌వ‌రిలో మరాఠా రెజిమెంట్ ద్వారా జమ్మూ కాశ్మీర్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను స్థాపించారు. ఈ విగ్రహాలలో ఒకటి సముద్ర మట్టానికి 14,800 అడుగుల ఎత్తులో LOC సమీపంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరో రెండు విగ్రహాలను పూణెకు చెందిన ఎన్జీవోలు ఏర్పాటు చేయనున్నారు.