Home Telugu Articles స్వరాజ్య కాంక్ష, కవితా సుసంపన్నత – సుబ్రమణ్య భారతి

స్వరాజ్య కాంక్ష, కవితా సుసంపన్నత – సుబ్రమణ్య భారతి

0
SHARE

సుబ్రమణ్య భారతి 39 సంవత్సరాలు మాత్రమే జీవించారు. అయినా అటు స్వరాజ్య సంగ్రామంలోనూ ఇటు ప్రజాహిత సాహితీ సృష్టిలోనూ తనదైన చెరగని ముద్ర వేశారు. వీర శివాజీని కొనియాడుతూ సుబ్రమణ్య భారతి 190 పంక్తుల ఒక అద్భుతమైన కవితను వ్రాశారు. 1906 సంవత్సరంలో ఇండియా అనే పత్రికలో ఆ కవిత ప్రచురితమైంది కూడా. తన సైన్యాన్ని ఉద్దేశించి ఛత్రపతి శివాజీ మహరాజ్ చేసిన ప్రసంగాన్ని రోమాలు నిక్కబొడుచుకునేలా ప్రస్తావించారు సుబ్రమణ్య భారతి. తమిళ, ఆంగ్ల భాషలు మాధ్యమంగా, స్వరాజ్య సాధన లక్ష్యంగా సుబ్రమణ్య భారతి కలం.. కొత్త పుంతలు తొక్కింది.