Home News సున్హారా సింగ్ ఆర్య… తెలంగాణ ప్రాంత విముక్తి కోసం ప్రాణాల‌ర్పించిన‌ అమరవీరుడు

సున్హారా సింగ్ ఆర్య… తెలంగాణ ప్రాంత విముక్తి కోసం ప్రాణాల‌ర్పించిన‌ అమరవీరుడు

0
SHARE

1939 వ సంవత్సరం, హైదరాబాద్ స్టేట్ నిజాముల చేతి నుండి స్వాతంత్య్రం పొందడం కోసం ఆర్యసమాజ్, హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ ఆధ్వర్యంలో సత్యాగ్రహం చేయడానికి స్థానిక ప్రజలతో పాటు బయటి రాష్ట్రాల నుండి కూడా అనేకమంది బయలుదేరి హైదరాబాద్ స్టేట్ లోని ముఖ్య పట్టణాలకు వేలాదిమంది చేరుకున్నారు.

ఇలా బుందేల్ఖండ్ నుండి సత్యాగ్రహం చేయడానికి వచ్చిన వందలాదిమంది తో పాటు “సున్హారా సింగ్ ఆర్య” గారిని కూడా అరెస్టు చేసి చంచల్ గూడ జైల్లో పెట్టి అనేక చిత్రహింసల పాలు చేసారు. ఒక సందర్భంలో జైలర్ లాఠీతో తలమీద బలంగా కొట్టిన కారణంగా సున్హారాసింగ్ ఆర్య గారు స్పృహ తప్పి పడిపోయిన రెండు రోజుల తర్వాత మృతి చెందారు.

ఇటువంటి అనేకమంది అజ్ఞాత వీరులు చేసిన పోరాటాలు బలిదానాల కారణంగానే నిజాం రాక్షసుల పీడ విరగడయింది. హైదరాబాద్ స్టేట్ విముక్తమైంది.

హైదరాబాద్ స్టేట్ విముక్తి కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి చరిత్ర ఇప్పటి తరానికి అందజేయాల్సిన అవసరం ఉన్నది.

– ఆకారపు కేశవరాజు