ఫిబ్రవరి 14న కాశ్మీర్ లోయలో పుల్వామ దగ్గర జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 45మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో దేశ ప్రజానీకం తీవ్ర విచారానికి, ఆవేదనకు గురయ్యారు. ఒకరకంగా ఇది ప్రచ్చన్న యుద్ధం. దీని నుంచి దేశాన్ని కాపాడేందుకు ప్రతి రోజు దేశంలో ఏదో ఒకమూల సైనికులు ప్రాణాలు త్యాగం చేస్తూనేఉన్నారు.
మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న మన వీర సైనికుల కుటుంబాలకు దేశ ప్రజానీకపు అండదండలు ఎప్పుడు ఉంటాయి. సైనికులు దేశాన్ని రక్షించడం కోసం తమ జీవితాలను ఆర్పిస్తున్నారు. కనుక వారి వృద్ధులైన తల్లిదండ్రులు, భార్యా పిల్లల సంరక్షణ బాధ్యత వహించడం దేశపు బాధ్యత. భారత ప్రభుత్వం రూపొందించిన `భారత్ కే వీర్’ అనే యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా మనం నేరుగా సైనికుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేయవచ్చును. అలాగే `భారత్ కే వీర్’ నిధికి కూడా మన వంతు మొత్తాన్ని సమకూర్చవచ్చును.
ఇలాంటి సందర్భాలలో తమ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు ఎల్లప్పుడు ముందు ఉంటారు. ఇప్పుడు కూడా అలా ముందుకు రావలసిన అవసరం ఉంది. అందువల్ల తమకు తోచిన విధంగా సహాయాన్ని అందించాలని దేశ ప్రజానీకానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజ్ఞప్తి చేస్తోంది. అలాగే ఈ విపత్కార పరిస్థితుల్లో ధైర్యంతో, సంయమనంతో వ్యవహరిస్తూ ఒక్కటిగా నిలవాలని పిలుపునిస్తోంది.
సైనికుల కుటుంబాలకు సహాయ నిధిని గృహ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన `భారత్ కే వీర్’ అనే యాప్ ద్వారా కానీ, `Indian brave hearts’ అనే వెబ్ సైట్ ద్వారా కానీ పంపవచ్చును.