ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి తమను తాము కాపాడుకునే విషయంపై రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త ఆటో ద్వారా ప్రచారం సాగిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.
హైదరాబాద్ మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన రంగుల శంకర్ నేత అనే స్వయంసేవక్ స్థానిక జవహార్ నగర్ తదితర ప్రాంతాల్లో ఆటో ద్వారా తిరుగుతూ అక్కడి ప్రజల్లో కరోనా మీద అవగాహన కల్పిస్తున్నాడు.
అంతేకాకుండా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుకుంటున్నాడు.
ఈ సందర్భంగా రంగుల శంకర్ నేత మాట్లాడుతూ.. కరోన వైరస్ లాంటి అతి ప్రమాదకరమైన అంటువ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో మన కోసం పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అధికారులు కనీస సదుపాయాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస సౌకర్యాలు కల్పించకుండా, కనీస జాగ్రత్తలు పాటించకుండా పారిశుద్ధ్య కార్మికుల చేత పనులు చేయించుకోవడం వారి ప్రాణాలతో చెలగాటం ఆడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నాడు.
కేవలం ప్రశ్నించడం మాత్రమే కాకుండా తనకు తోచినంతలో అక్కడి వారికి ఉచితంగా మాస్కులు కూడా పంపిణీ చేస్తున్నాడు.