కర్నాటక రాష్ట్రంలోని మైసూర్‌లో 3000 లకు పైగా భగవద్గీత పుస్తకాలున్న లైబ్రరీకి నిప్పంటించిన ఘటనలో పోలీసులు సయ్యద్ నజీర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మైసూరులో సయ్యద్ ఇసాక్ అనే వృద్ద ముస్లిం వ్యక్తి నిర్వహిస్తున్న లైబ్రరీకి ఈ నెల 9న మంటలు అంటుకోవడంతో అందులో ఉన్న 3000 పైగా భగవద్గీత పుస్తకాలతో సహా మరికొన్ని ఇతర పుస్తకాలు దగ్ధమయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లైబ్రరీ ముస్లిం వ్యక్తిది కావడంతో ఇది మతపరమైన చర్చకు కూడా దారి తీసింది. ఏప్రిల్ 9న జరిగిన ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా సయ్యద్ నజీర్ అనే వ్యక్తి(35) సిగరెట్ అంటించి లైబ్రరీలోకి విసిరేశాడని దీంతో పుస్తకాలు దగ్ధమయ్యాయని తెలింది. ఈ మేరకు ఏప్రిల్ 19న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవటంతో లైబ్రరీ ని పునర్నిర్మించడానికి కొంతమంది దాతలు విరాళాలు ఇచ్చారు. ఈ రకంగా రూ.30 లక్షల జమయ్యాయి.
Source : ORGANISER