Home Ayodhya నిధి సమర్పణలో పురాతన దేవాలయ పునరుద్ధరణ

నిధి సమర్పణలో పురాతన దేవాలయ పునరుద్ధరణ

0
SHARE

రామ మందిర నిధి సమర్పణ కార్య‌క్ర‌మంలో ఒక అద్భుత‌మైన ఘ‌ట‌న‌ జ‌రిగింది. సుమారు 15 సంవ‌త్స‌రాలుగా పూజాపున‌స్కారాలు లేని ఒక‌ దేవాల‌యంలో తిరిగి అవి ప్రారంభ‌మ‌య్యాయి. అయోద్య రామ మందిర నిర్మాణం కోసం చేప‌ట్టిన నిధి స‌మ‌ర్ప‌ణ కార్యక్ర‌మంలో భాగంగా వికారా‌బాద్ జిల్లా, పూడూరు మండ‌లం, గ‌ట్టుప‌ల్లి గ్రామంలో కార్యకర్తలు గ్రామంలో ప‌ర్య‌టిస్తున్న‌ప్పుడు శిథిలావ‌స్థ‌లో ఉన్న ఒక హ‌నుమాన్ దేవాల‌యం క‌నిపించింది. సుమారు ద‌శాబ్ధ కాలం నుంచి ఆ దేవాల‌యంలో పూజ‌లు నిలిచిపోయాయి. దీంతో వారు ఆ గ్రామ స‌ర్పంచ్ స‌హ‌కారంతో  హ‌నుమాన్‌ దేవాల‌య  పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు ప్రారంభించారు.
ఈ కార్య‌క్ర‌మానికి పూనుకున్న గ్రామ సర్పంచ్, కంకల్ రవీందర్, మంచన్ పల్లి  సత్యనారాయణ రెడ్డి, రవితేజ, కంకల్ సద్ది శ్రీకాంత్, బుగ్గన్నోల్ల ప్రవీణ్, ఆకుల నాగరాజు, గట్టుపల్లి అంజయ్య, కృష్ణ, వెంకటేష్, రాఘవేంద్ర ల‌ను గ్రామ‌స్తులు అభినందించారు.

రామ కార్యపు  ప్రభావం సమాజంపై ఎలా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక చ‌క్క‌టి ఉదాహరణ.