దక్షిణాది రాష్ట్రమైన కేరళ ఎదురుకుంటున్న ఇస్లామిక్ తీవ్రవాద కాదాంశం తో నిర్మితమైన చలన చితము ‘ద కేరళా స్టోరీ ‘ త్వరలో విడుదలకు సిద్దమై దేశ చలన చిత్ర పరిశ్రమలో ఆసక్తి రేపుతోంది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో అదా శర్మ నటించిన ఈ చితం మే 5న విడుదల కానుంది.
35 వేల మంది మహిళలు ఆందోళనకర రీతిలో గల్లంతై.. మత మార్పిడులకు గురైన తీరు,వారిని దేశ విచ్ఛిన్న కర శక్తులుగా తయారు చేసి తీవ్రవాదులు గా మార్చి దేశములోనూ ప్రపంచమంతటా వ్యాప్తి చేస్తున్న తీరును వివరించి చూపారు.
(నివురు కప్పిన సత్యావిష్కరణ ) ‘అన్ కవరింగ్ అఫ్ హిడెన్ ట్రూత్’ అనే నిర్వచనం ఈ చలన చిత్రానికి నినాదం గా ఈయబడినది. ఈ చిత్రము దేశానికి విపత్తుగా మారిన ఇస్లామేమిక్ ఉగ్రవాదం అనే అంశము పై నిర్మితమైనది. ఈ చలనచిత్ర ప్రచార ప్రకటనా చిత్రం లో ఒక బురఖా ధరించిన స్త్రీ మూర్తి కనిపిస్తుంది. విలేకరుల సమావేశము లో విడుదల తేదీని ప్రకటించారు. సన్షైన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాయోజకత్వం వహించిన ఈ చిత్రానికి ఆ సంస్థ వ్యవస్థాపకులు విపుల్ అమృతలాల్ షా నిర్మాణత్వ, సృజనాత్మక దర్శకత్వ , సహ రచయిత బాధ్యతలు నిర్వహించారు.
దర్శకులు సుదీపీతో సేన్ గతం లో ‘ఆస్మా’. ద ‘లక్నో టైమ్స్’ ,’ద లాస్ట్ మాంక్’ అను విజయవంత చిత్రాలకు ప్రసిద్ధి చెందారు. ఈ చలన చిత్రము ఇస్లామేమిక్ తీవ్రవాదం, వేర్పాటు వాదాలపై ఆసక్తి కరమైన చర్చ లను, కలకలాన్ని రేపే అవకాశాలు మెండు గా ఉన్నాయి. ‘ద కేరళ స్టోరీ ‘ చలన చిత్ర విడుదల కొరకు ప్రేక్షకుల మరియు చలన చిత్ర విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.