
బంధుభావం లేకుండా సమరసత పరస్పరం సాధ్యం కాదని భావించి గ్రామ గ్రామాన కుల పెద్దల ను కూర్చోపెట్టి చట్టం ద్వారా కాకుండా సంస్కారాల ద్వారా మాత్రమే సామరస్యం వెల్లి విరుస్తుందని తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత వేదిక కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ తెలియచేశారు. మధ్యలో వచ్చిన ఈ దురాచారాలు మన ధర్మంలో ప్రారంభం నుండి వున్నట్లు కొందరు చాదస్తులు చెప్పినప్పటికీ , వాటిని ఖండించి ఈ కాలంలో వాటి అవసరాలు లేవని అవి మానవ జాతి కి తీరని కళంకం గా భావించి వాటిని నిర్మూలించాలని వక్తలు పిలుపునిచ్చారు. నిమ్న వర్గాల ప్రజలు ఎవరి దయా దాక్షిణ్యా ల పై ఆధార పడకుండా అందరితో సమానంగా గౌరవ స్థానం కోరుకుంటారని అది కూడా తమ పురుషార్థాలపై సాధించాలని వారు ఆకాంక్షించారు. 1983 లో పూణె లో దత్తోపంత్ జీ ద్వారా ఈ సామాజిక సమరసతా వేదిక ప్రారంభమైందని శ్రీ అప్పాల ప్రసాద్ జీ తెలిపారు

