Home News గుజ‌రాత్‌: పురావస్తు తవ్వకాల్లో బ‌య‌ట‌ప‌డ్డ‌ ధోలవీర కంటే పురాత‌మైన, 3200 BCE నాటి శ్మ‌శాన వాటిక

గుజ‌రాత్‌: పురావస్తు తవ్వకాల్లో బ‌య‌ట‌ప‌డ్డ‌ ధోలవీర కంటే పురాత‌మైన, 3200 BCE నాటి శ్మ‌శాన వాటిక

0
SHARE

గుజరాత్‌లోని కచ్‌లోని హరప్పా ప్రదేశాలలో పురావస్తు శాఖ నిర్వ‌హిస్తున్న త‌వ్వ‌కాల్లో 3200 BCE నాటి స్మారక శ్మశాన వాటిక బ‌య‌ట‌ప‌డింది. ఇది ధోలవీర కంటే పురాతనమైనదిగా వెలువ‌డింది. గుజరాత్‌లోని హరప్పా కాలం నాటి అతిపెద్ద స్మారక చిహ్నాలలో ఒకటైన త్రవ్వకాల్లో మ‌నిషి చ‌నిపోయిన‌పుడు మ‌నిషిని కొన్ని వ్యక్తిగత కళాఖండాలు, జంతువులు, ఆహారం – నీటి కుండలు వంటి వాటితో స‌హ ఖననం చేయబడిన పురాతన మానవులను పోలి ఉన్నాయి. ఇది అప్ప‌టి నాగరికతను స్ప‌ష్టం చేస్తున్నాయి.

కచ్ జిల్లాలోని లఖ్‌పత్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జునా ఖతియా గ్రామంలో 2019లో త్రవ్వకం ప్రారంభమైంది. పురావస్తు శాస్త్రవేత్తలు అస్థిపంజర అవశేషాలు, సిరామిక్ కుండలు, ప్లేట్లు, కుండీలపై, పూసలతో చేసిన నగలు, జంతువుల ఎముకలతో ఉన్న సమాధుల వరుసలను కనుగొన్నారు. తవ్వకాలు కొన‌సాగాయి. దీని ఫలితంగా ఈ ప్రదేశం కాలక్రమేణా 500 సమాధుల అతిపెద్ద హరప్పా శ్మశానవాటికగా అవతరించింది. ఇప్పటి వరకు సుమారుగా ఉన్న 500 సమాధులలో, సుమారు 125 కనుగొనబడ్డాయి. ఈ సమాధులు 3,200 BCE నుండి 2,600 BCE మధ్య కాలం నాటివి అనే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అంటే ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన దోలవీర, అలాగే రాష్ట్రంలోని అనేక ఇతర హరప్పా ప్రదేశాల కంటే పూర‌త‌మైన‌దిగా తెలుస్తుంది.

TOI నివేదికల ప్రకారం, “కచ్‌లో కొత్తగా ఉద్భవిస్తున్న ఈ ప్రదేశం ముఖ్యమైనది. ధోలవీర వంటి ఇతర ప్రదేశాలు పట్టణంలో చుట్టుపక్కల స్మశానవాటికను కలిగి ఉన్నాయి. అయితే జునా ఖతియా సమీపంలో పెద్ద నివాసాలు కనుగొనబడలేదు. ఈ స్థ‌లం భూమి-దిబ్బ ఖననాల నుండి రాతి సమాధులుగా మారిన ఆన‌వాలు క‌నిపిస్తున్నాయి. ఈ స్థ‌లంలో వెలువ‌డిన కుండలు సింధ్, బలూచిస్తాన్‌లోని హరప్పా ప్రదేశాల నుండి త్రవ్విన లక్షణాలను, శైలిని కలిగి ఉన్నాయి. ఈ కళాఖండాలు గుజరాత్‌లోని హరప్పా ప్రదేశాలలో ఇతర పూర్వ పట్టణ విధానాన‌ల‌ను క‌లిగి ఉన్నాయి.” అని తవ్వకాల డైరెక్టర్, కేరళ విశ్వవిద్యాలయ‌ పురావస్తు శాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ SV రాజేష్ చెప్పారు.

తవ్వకం నుండి సేకరించిన సమాచారం ప్రకారం, “ఇసుకరాయితో తయారుచేయ‌బ‌డిన దీర్ఘచతురస్రాకార సమాధులు ఆన‌వాలు వెలువ‌డ్డాయి. ఇవి ఈ ప్రాంతంలో సాధారణ శిలలు, మట్టి గిన్నెలు, వంటకాలు వంటి వస్తువులు కాకుండా, పూసలు, టెర్రకోట, సీషెల్స్, లాపిస్ వంటి విలువైన ఆస్తులు చనిపోయిన వారితో ఖననం చేశారు. సమాధిలో ఎక్కువ భాగం ఐదు నుండి ఆరు కుండలు కలిగి ఉన్నాయి. ఒకదానిలో 62 చిన్న కుండలు దొరికాయి. ఇప్పటివరకు ఎటువంటి లోహపు కళాఖండం కనిపించ‌లేదు.”అని రాజేష్ చెప్పారు. గత వారం IIT గాంధీనగర్‌లో జరిగిన ఒక ఉపన్యాసంలో రాజేష్ మాట్లాడుతూ కొన్ని శ్మశాన నిర్మాణాలకు బసాల్ట్ రాళ్లతో క‌ప్ప‌బ‌డి ఉన్నాయి. స్థానిక రాయి, బసాల్ట్ రాళ్లు, మట్టి, ఇసుక మొదలైన వాటితో కూడిన గులకరాళ్లు, వీటిని అంటిచ‌డానికి బంకమట్టిని ఉపయోగించిన‌ట్టు తెలిసింద‌ని తెలిపారు.