Home News జైనూర్ దాడుల నేపథ్యంలో ముస్లిం వర్గాలపై ఆదివాసీల తీర్మానాలు

జైనూర్ దాడుల నేపథ్యంలో ముస్లిం వర్గాలపై ఆదివాసీల తీర్మానాలు

0
SHARE

ఆదివాసి యువకుడైన మర్సుకోల లక్ష్మణ్‌పై గిరిజనేతర వర్గం దాడి చేయడం ఆదివాసీ అస్థిత్వంపై జరిగిన దాడేనని తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆదివాసీ సమాజంపై దాడిచేసినవారు, వెనుక నుండి దాడి చేయించిన వారు ఎంతటివారైనా వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం, హత్యానేరం కింద వెంటనే కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలను పోలీస్ వారికి అందించారు. జైనూర్ ఘటన నేపథ్యంలో దాడికి నిరసనగా శనివారం కుమ్రంభీం జిల్లా సిర్పూర్-యు మండలంలో మహగాంవ్ శ్రీగోండ్వానా పంచాయితీ రాయిసెంటర్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసులు తీర్మానాలు చేసి పోలీసు ఉన్నతాధికారులకు అందించారు. ఇలాంటి ఘటనలు ఏజెన్సీలో మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని పట్టుబట్టారు.

ఆదివాసీ న్యాయవ్యవస్థలో చర్చించిన అంశాలను, పలు డిమాండ్‌లను తీర్మానాల రూపంలో పోలీసువారికి ఇచ్చామని, వాటిని పోలీసులు నిశితంగా పరిశీలించి, చర్చించి తగుచర్యలు తీసుకోవాల్సి ఉండగా అలాంటిదేమీ జరగలేదని ఆదివాసీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితులు ప్రశాంతంగా మారేందుకు గాను జైనూర్ మార్కెట్‌ను మరికొన్ని రోజులు బంద్ చెయ్యాలని ఈ తీర్మానంలో మరో ముఖ్యమైన డిమాండ్ ఉన్నప్పటికీ పోలీసుశాఖ ఆదివాసీ డిమాండ్లను ప్రక్కన పెట్టి జైనూర్ మార్కెట్ బంద్ చేయలేమని, ఎవరైనా బంద్ చేస్తే చర్యలు తీసుకుంటామని, అడ్డుకోవద్దని చెప్పడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దాడి చేసిన వర్గాన్ని వెనుకేసుకురావడం ఏంత వరకు సమాంజసమంటూ… అధికారులు ఆదివాసీల పక్షాన నిలబడటం లేదనేది స్పష్టంగా కనిపిస్తోందని ఆదివాసులు తేల్చి చెబుతున్నారు.

తమకు భావప్రకటన స్వేచ్చను ఇవ్వడం లేదని, భారత రాజ్యంగంలోని షెడ్యూల్డ్ ఏరియాలో భాగంగా ఆదివాసులకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ ఆ చట్టాలను సైతం గౌరవించడం లేదని ఆదివాసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతపైన జరిగిన దాడికి నిరసనగా మార్కెట్ బంద్ చేయాలని చెప్పినప్పటికీ పోలీసులు ఏకపక్షంగా పోలీసులు మరో వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గూడెం గ్రామాలలో చర్చ జరుగుతోంది. పోలీసు వ్యవస్థకు 1/70, పెసా చట్టాల పట్ల అవగాహన ఉన్నప్పటికీ, ఇలా కావాలని చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అనే సందేహం ఉందన్నారు. తమ హక్కులు, చట్టాలకు లోబడి చట్టాలను గౌరవిస్తూ ఈ ప్రాంతంలో పోలీసు వ్యవస్థ పనిచేయాలి కానీ, ఇలా జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులే చట్టాన్ని నిర్వీర్యం చేయడమేమిటని నిలదీస్తున్నారు.

ఆదివాసులు తీర్మానాలలోని పలు అంశాలు ఇవే….

తేదీ 18`52024 నాడు శనివారం రోజున సిర్పూర్‌, లింగాపూర్‌, జైనూర్‌లోని గోండ్వానా పంచాయితీ రాయి సెంటర్‌ ఆధ్వర్యంలో ఆదివాసులం ఈ క్రింది తీర్మానాలు చేశాం.

1. ఏజెన్సీ మండలాలయిన సిర్పూర్‌, జైనూర్‌, లింగపూర్‌ మండలాలలో 1/70 పెసా చట్టాలను ప్రభుత్వ అధికారులు పకడ్బందీగా అమలు చేయాలి.

2. మర్సకోల లక్ష్మణ్‌పై దాడి చేసిన ముస్లిం, గిరిజనేతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా అతని కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలి. నాణ్యమైన వైద్యం కూడా అందించాలి.

3. మసీదుల పరిమితిని తగ్గించాలి. బహిరంగంగా పెట్టవద్దు.

4. అక్రమంగా వలస వచ్చిన గిరిజనేతర ముస్లింలను మైదాన ప్రాంతానికి పంపాలి.

5. మా గ్రామాలలో ఐస్‌క్రీం, ఇతర వ్యాపారాల కోసం వచ్చే ముస్లింలను గ్రామాలకు రానివ్వొద్దు. వారు ఎలాంటి వ్యాపారం చేయకూడదు.

6. వలస వచ్చి అక్రమంగా భూములను ఆక్రమించిన వారి భూములను ఐటీడీఏ కోర్టు ద్వారా తిరిగి మాకు అప్పగించాలి.

7.కత్తులతో, కర్రలతో ఏజెన్సీ ప్రాంతం జైనూర్‌లో భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి ఆదివాసీ యుకుడైన మర్సుకోల లక్ష్మణ్‌పైన దాడి చేసిన సమయంలో ఈ దాడిలో పాల్గొన్న ముస్లింలపై అట్రాసిటీ, హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలి.

8. జైనూరులో వుండి ఆదివాసీలపై దాడి చేసి, భయంకరమైన వాతావరణం సృష్టించిన ముస్లింలకు ఈ ప్రాంతంలో జీవించే హక్కు లేదు. మైదాన ప్రాంతానికి పంపాలి. ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.

ఏజెన్సీ ప్రాంత హక్కులు, చట్టాలకు భంగం కలిగించడమే కాకుండా ఏజెన్సీలో అక్రమ వ్యాపారాలు చేస్తూ, ఆదివాసి జాతి అస్థిత్వంపై దాడి చేయడం రాజ్యాంగం విరుద్ధమని ఆదివాసీ నేతలు స్పష్టం చేశారు. అల్లరిమూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆదివాసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. తాము నిరసన తెలుపకూడదా? భావ ప్రకటన ద్వారా సమాజానికి జరిగిన అన్యాయంపై మాట్లాడవద్దా… చట్టం ఏం చెబుతుందో పోలిసువారే చెప్పాలని అడిగారు. ధర్నాలు చేస్తే అరెస్టు చేస్తామంటున్న పోలీసులు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఓ వర్గం దాడి చేస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపైన, పోలీసుశాఖ పైన లేదా? అని ప్రశ్నించారు. నేరం చేసిన ఎంతో మంది తప్పించుకు తిరుగుతున్నారని, కొందరు కళ్లెదురుగానే ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆదివాసుల గొంతును కట్టడి చేయండని ఏ రాజ్యాంగం చెబుతుందని అడిగారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ / కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు కుమ్రం భీం జిల్లా పోలీసు ఉన్నత అధికారులపై విచారణ జరిపించాలని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. జైనూర్ ఘటన నేపథ్యంలో ఆదివాసిల డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వానికి తెలపకుండా, ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఏకపక్షంగా అవతలి వర్గం చెప్పినట్లు నడుచుకోవడంపై ఆదివాసులందరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ పరిణామాలపై రాష్ట్ర గవర్నర్, కేంద్ర, రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ-కమీషన్లు, మానవ హక్కుల కమీషన్లు స్పందించాలని, అవసరం అయితే కోర్టు సైతం సుమోటోగా కేసు తీసుకోని ఆదివాసీల హక్కులను పరిరక్షించి చట్టాలను అమలు చేయాలని, గోండ్వాన రాయి సెంటర్‌లో ఆదివాసీలు చేసిన తీర్మానాలను తక్షణమే అమలు చేసేలా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వాలని ఆదివాసీలు కోరారు.