బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా వస్తున్న రోహింగ్యాలపై రాచకొండ పోలీసులు నిఘా పెంచారు. ఇటీవల బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఉంటున్న రోహింగ్యాలను బంగాళఖాతంలోని ఒక మారుమూల ద్వీపమైన భాసన్ చార్‌లోని పునరావాస కేంద్రాలకు పంపాలని నిర్ణయించిందని, ఈ పరిణామాల నేపథ్యంలో నిఘా సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు వలస దారులపై నిఘా పెంచినట్టు రాచకొండ సీపీ మహేస్ భగవత్ తెలిపారు.
రాచకొండ పరిమితుల్లో ఉన్న 4,500 మంది రోహింగ్యాలను గుర్తించామని, హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రోహింగ్యాల వివరాలను సేకరించి, వారి బయోమెట్రిక్, ఐరిస్ వివరాలను గుర్తించి వారిపై నిఘా ఉంచినట్టు కమిషనర్ తెలిపారు. వలసదారులు భారత చట్టాలను ఉల్లంఘించిన నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 66 కేసులు వారిపై నమోదయ్యాయని, రెండు కేసుల్లో రోహింగ్యాలను కోర్టు దోషులుగా నిర్ధారించిందని కమిషనర్ తెలిపారు. కొద్దిమంది రోహింగ్యాల బయోమెట్రిక్ డేటా సేకరణ పెండింగ్‌లో ఉందని, రాబోయే 10 రోజుల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
READ : Bangladesh to move another batch of Rohingya Muslim refugees to Bhasan Char Island