Home News టీటీడీ ఉద్యోగుల మతమార్పిళ్లపై విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

టీటీడీ ఉద్యోగుల మతమార్పిళ్లపై విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

0
SHARE

ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రెస్తవ ఉద్యోగుల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కొందరు క్రైస్తవ ఉద్యోగులు హిందువులుగా చెప్పుకుని టీటీడీలో పనిచేస్తున్నారు. మరికొందరు హిందూ ఉద్యోగులు దేవస్థానంలో చేరాక క్రైస్తవమతం స్వీకరిస్తున్నారు. ఈ రెండు వ్యవహారాల వెనుక చర్చి కుట్ర ఉందని పేర్కొంటూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శిని ఆశ్రయించింది.

దేవస్థానంలో పనిచేస్తూ క్రీస్తు ప్రార్ధనలు చేస్తూ, చర్చిలు నిర్వహిస్తున్న క్రైస్తవ ఉద్యోగుల ఆదాయ వనరులు, వారిని వెనుక నుండి నడిపిస్తున్న సంబంధిత చర్చిలను గుర్తించాలని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ హోమ్ శాఖ కార్యదర్శిని కోరింది. ఇటీవల కొందరు టీటీడీ ఉద్యోగులు చర్చిలలో ప్రార్ధనలు చేస్తున్న విషయం గమనించిన ఒక  పార్టీ ప్రతినిధులు పకడ్బందీగా ఆ దృశ్యాలను వీడియో చిత్రీకరించారు. వీటి ఆధారంగా ఆ ఉద్యోగులపై తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి కార్యాలయానికి అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 

తిరుమల దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించే ఇటువంటి చర్యలపై అధికారుల ఉదాసీన, అనుమానాస్పద వైఖరిని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదులో ప్రస్తావించింది. టీటీడీలో ఉన్న క్రైస్తవ ఉద్యోగులతో పాటు వారి వెనుక ఉన్న చర్చిలకు గల విదేశీ సంబంధాలు, నిధులు, స్థిరచర ఆస్తుల తదితర విషయాలపై కూడా విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోర్టినట్టు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ప్రకటనలో తెలియజేసింది.

గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న 44 మంది హైందవేతర ఉద్యోగుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గత కొంత కాలంగా తిరుమలలో వెలుగుచూస్తున్న అన్యమత సంబంధిత వ్యవహారాలు ప్రపంచ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయి.