ఢిల్లీలోని కలిండి కుంజ్ ప్రాంతంలోని రోహింగ్యాలు ఉంటున్న ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాత నీటి పారుదల శాఖ పోలీసు సహాకారంతో కలిసి రోహింగ్యాల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోకున్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తకానుంది.
2018లో జకాత్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తాత్కలిక శిబిరంలో రోహింగ్యాలు ఉన్నారు. ఆ సయంలో అక్కడ భారీ అగ్నిప్రమాదం జరగగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాత్కలికంగా ఉండటానికి రోహింగ్యాలను కొంత భూమిని ఇచ్చింది.
స్థానిక ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ సహకారంతో రోహింగ్యాలు భూమిపై స్థావరాలు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. 2018 నుంచి ఇప్పటివరకు రోహింగ్యా కుటుంబాల సంఖ్య కూడా 36 నుండి 50 కి పెరిగాయి. రోహింగ్యాల గురించి స్థానిక నివాసితుల నుండి పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి వద్ద నుంచి తమ భూమని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది.
Source : ORGANISER