
అంధకారంపై వెలుగుల గెలుపే దీపావళి. మరోవిధంగా చెప్పాలంటే అజ్ఞానంపై జ్ఞానం గెలుపు. ప్రతీ సంవత్సరం ఆశ్వయిజ అమావాస్యనాడు ప్రతీ హిందూబంధువులు దీపావళిని జరుపుకుంటారు. అయితే కేవలం నాగరిక ప్రపంచం మాత్రమే కాదు మన అడవులలో ఉన్న అనేక వనవాసీ తెగలు కూడా ఆడంబరంగా దీపావళిని జరుపుకుంటారు. వారు జరుపుకునే విధివిధానాల్లో తేడా ఉండచ్చు కానీ వారుకూడా ఆడంబరంగా పండుగను జరుపుకుంటారు.