Home News వీరకిశోరం రామ్ ప్రసాద్ బిస్మిల్

వీరకిశోరం రామ్ ప్రసాద్ బిస్మిల్

0
SHARE
స్వాతంత్ర పోరాటానికి ప్రేరణ దాయకమైన సాహిత్యాన్ని అందించిన గొప్ప కవులలో ఒకరు రామ్ ప్రసాద్ బిస్మల్. వారు వ్రాసిన ”మేరా రంగ్ దే బసంతి చోళ అనే ” పాట ఈ రోజుకీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఉర్దూ, హిందీ భాషల్లో ప్రేరణదాయకమైన దేశభక్తి కవితలను రామ్, అగ్యత్ అనే కలంపేర్లతో బిస్మల్ రాసేవారు.
రామ్ ప్రసాద్ బిస్మిల్ 1897 జూన్ 11న ఉత్తరప్రదేశ్ కి చెందిన షాజహన్పూర్ లో మురళీధర్, మూల్మతి పుణ్య  దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే స్వాంతంత్ర్య పోరాటం పట్ల ఆకర్షితులైన వారు ఆర్యసమాజంలో చేరారు. ఆర్యసమాజ్ గురువైన స్వామి సోమదేవ్ ప్రభావంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్రంకోసం  పని చేయటం ప్రారంభించాడు. అలా స్వామి సోమదేవ్ ప్రేరణతో 1916 వ సంవత్సరంలో లక్నో లో  జరిగిన కాంగ్రెస్ సభలలో పాల్గొన్నాడు. ఆ స‌మయంలో ”మాతృవేది ” అనే పేరుతో పనిచేస్తున్న విప్లవ సంస్థ సభ్యులతో పరిచయం అయింది. వాళ్లతో పని చేయటం ప్రారంభించాడు. ఒక దేశం అభివృద్ధికి రాజకీయ స్వేచ్ఛ కావాలి, దానికోసం సాయుధ పోరాటం అత్యంత ఆచరణీయమైన మార్గమని భావించాడు. దానిలో  భాగంగా దీక్షిత్  శివాజీ సమితి అనే పేరుతొ ఒక  సాయుధ సంస్థను కూడా ఏర్పాటు చేశారు.
1918 జనవరి 28న బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగ బిస్మిల్ రచించిన కవిత “మణిపూరి కీ ప్రతిజ్ఝ” కూడా జోడించి ఒక కరపత్రం ముద్రించి  పంపిణీ చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి పనిచేయాలని అందులో విజ్ఞప్తి చేశాడు. దానితో మాతృవేది  సంస్థకు చెందిన అనేక మందిని బ్రిటిష్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు కానీ బిస్మిల్ ఆ సమయంలో  తప్పించుకున్నాడు.
సహాయ నిరాకరణ ఉద్యమం విఫలమైన తర్వాత దేశంలో పనిచేస్తున్న విప్లవ సంస్థల  పునర్ వ్య‌వస్థీకరణ జరిగింది. దాని ఫలితంగా సత్యేంద్రనాథ్ సన్యాల్, జడుగోపాల్  ముఖర్జీ, రాంప్రసాద్ బిస్మిల్  కలిసి ” హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్” పేరుతో 1924 సంవత్సరంలో ఒక సంస్థ ప్రారంభించారు. ఆ వేదికనుండి తదుపరి కాలంలో భగత్ సింగ్ , చంద్రశేఖర్ ఆజాద్ లాంటి   గొప్ప విప్లవకారులు పనిచేసారు.
సాయుధ పోరాటానికి జర్మనీ నుండి ఆయుధాలు తెప్పించుకొనేందుకు నిధుల సేకరణకు ప్రభుత్వ సంపదలను చేచిక్కించుకొనేందుకు1918 లో మూడుసార్లు విఫల ప్రయత్నిం జరిగింది. చివరకు 1925ఆగష్టు 9 న  బిస్మిల్‌తో పాటు అతని  సన్నిహితులు అష్ఫకుల్లా ఖాన్ మొదలైనవారు సహారన్పూర్ లక్నో ప్యాసింజర్ రైలును కకోరి వద్ద అపి అరైల్ లో తీసుకొని పోతున్న ప్రభుత్వ   ఖజానా ను దోచుకున్నారు.దానినే బ్రిటిష్ రాజ్యాన్నికూల కొట్టడానికి చేసిన రాజద్రోహంకేసు దానినే కాకోరి కుట్ర కేసు అంటారు. దానితో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ కు సంబంధించిన సభ్యులను అనేకమందిని అప్పటి ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.
బ్రిటిష్ వాళ్ళు ఆ కుట్ర కేసుకు సంబంధించి రాంప్రసాద్ బిస్మిల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు 18నెలల  విచారణ తర్వాత 1927 డిసెంబర్ 19న అష్ఫకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్,  రోషన్,  లహరి సింగ్ లను గోరఖ్ పూర్ జైలు లో ఉరితీశారు. వారికీ రప్తి నది తీరంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తీరాన్ని ఇప్పుడు రాజఘాట్ అని పిలుస్తున్నారు.
రామ్ ప్రసాద్ బిస్మిల్   లక్నో సెంట్రల్ జైలులో ఖైదిగా ఉన్న సమయంలో తన ఆత్మకథ రాశాడు. దానిని రహస్యంగా బయటికి పంపి ప్రతాప్ ప్రెస్ లో ముద్రించారు. అది ఈ రోజుకి హిందీ సాహిత్యంలో అత్యుత్తమ రచనలలో ఒకటిగా ఉంది. రామ్ ప్రసాద్ బిస్మిల్ రాసిన మేరా జనంపాట చాలా  ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. 30 సంవత్సరాల వయస్సులో దేశం కోసం బలిదానమైన వీర  కిశోరం రామ్ ప్రసాద్ బిస్మిల్ అందిరికీ ఆదర్శప్రాయుడు