
సేవా భారతి ఆధ్వర్యంలో శ్రద్ధాభాద్ నగరంలో వినాయక చవితి పర్వదినం రోజున వర్మి కంపోస్ట్ యూనిట్ ను ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా సేవా ప్రముఖ్ శ్రీ చవ్వా మహేష్ గారు మరియు గ్రామ భారతి అధ్యక్షులు శ్రీ స్తంభాద్రి రెడ్డి గారు , బస్తీ ప్రముఖ్ శ్రీ సర్వేశ్ గారు మరియు కాలనీ ప్రజలు, స్వయం సేవకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వర్మీ కంపోస్ట్ యూనిట్ ప్రారంభ సూచకంగా శ్రీ స్తంభాద్రి రెడ్డిగారు, ఇతర స్వయంసేవకులు సేకరించిన వ్యర్ధాలను యూనిట్లో వేసి గోమయం చల్లడం జరిగింది. కార్యక్రంలో భాగంగా సేవా ప్రముఖ్ శ్రీ మహేష్ భారతమాత చిత్రపటానికి పూజలు నిర్వహించారు.

చివరగా స్వయంసేవకులను ఉద్దేశించి గ్రామ అధ్యక్షులు శ్రీ స్తంభాద్రి రెడ్డి గారు ఉపన్యసించారు . పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత, జల సంరక్షణ, ప్లాస్టిక్ నిషేధం, చెట్ల పెంపకం తదితర అంశాలపై సవివరంగా మాట్లాడుతూ ఈనాడు సమాజం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య పర్యావరణ కాలుష్యం. దానిని ఎదుర్కోవడానికి స్వయం సేవకులు ఇటువంటి ప్రకల్పాలు విరివిగా నిర్వహించాలని సూచించారు.